బ్రహ్మానందం చిన్న కొడుకు గురించి తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
హాస్యబ్రహ్మ బ్రహ్మానందం గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బ్రహ్మానందం దాదాపుగా 1000 పైగాని సినిమాల్లో నటించాడు.అంతేకాదు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డును సైతం సొంతం చేసుకున్నాడు హాస్యబ్రహ్మ బ్రహ్మానందం. ఈతరం దర్శకులు బ్రహ్మానందం ని సరిగ్గా వినియోగించుకోవడం లేదు కానీ.. ఆయన కామెడీ వేరే లెవెల్ లో ఉంటుంది . అప్పట్లో కేవలం బ్రహ్మానందం కామెడీ కోసమే సినిమా చూసిన వారి సంఖ్య కూడా చాలానే ఉంటుంది .ప్రస్తుతం జనరేషన్ బ్రహ్మానందం మీన్స్ ను తెగ వాడేసుకుంటున్నారు. అయితే ఒకప్పుడు అన్ని సినిమాల్లో నటించిన బ్రహ్మానందానికి ఇద్దరు కొడుకులు పెద్దబ్బాయి.

పెద్ద కొడుకు గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన పల్లకిలో పెళ్లికూతురు సినిమాతో పాటు పలు సినిమాల్లో నటించారు. కానీ ఆయన నటించిన ఒక్క సినిమా కూడా కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేకపోయింది. అయితే బ్రహ్మానందానికి ఇద్దరు కొడుకులు ఉన్నారన్న సంగతి చాలా మందికి తెలియదు. అయితే బ్రహ్మానందానికి గౌతమ్ తో పాటు మరొక అబ్బాయి కూడా ఉన్నాడు. ఇక ఆయన పేరు సిద్ధార్థ. చూడడానికి హీరోలా ఉన్నా కూడా అతను సినిమాల పట్ల పెద్దగా ఇంట్రెస్ట్ చూపడు. బ్రహ్మానందం చిన్న కొడుకు అమెరికాలో స్థిరపడ్డాడట.

 అమెరికాలో మంచి సంపాదనతో వ్యాపారం చేస్తున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. అయితే ఇటీవల బ్రహ్మానందం చిన్న కొడుకు సిద్ధార్థ వివాహ నిర్షితార్థం డాక్టర్ ఐశ్వర్యతో చాలా అంగరంగ వైభవంగా జరిగింది. పెద్దలు కుదిరిచిన ఈ వివాహం నిశ్చితార్థంకు చాలామంది సినీ ఇండస్ట్రీ ప్రముఖులు సైతం రావడం జరిగింది.ఇక బ్రహ్మానందం చిన్న కొడుకు సిద్ధార్థ పెళ్లి త్వరలోనే ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు ఆ పెళ్ళికి సినీ ఇండస్ట్రీకి చెందిన చాలామంది స్టార్ హీరోలు సైతం హాజరు కాబోతున్నట్టుగా వార్తలు వినబడుతున్నాయి. దీంతో ప్రస్తుతం బ్రహ్మానందం చిన్న కొడుకు సిద్ధార్థ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: