ఏకంగా ఆ పాన్ ఇండియా సినిమాలో చేసే ఛాన్స్ కొట్టేసిన కృతి శెట్టి..!?

Anilkumar
ఉప్పెన సినిమాతో దూసుకొచ్చిన ముంబై బ్యూటీ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా తర్వాత ఉప్పెన సినిమా అంతటి సక్సెస్ అందుకోలేకపోతోంది ఈమె. బంగార్రాజు శ్యామ్ సింగరాయ్ ఇలాంటి సినిమాలు పర్వాలేదని అనిపించుకున్నప్పటికీ భారీ ఆశలు పెట్టుకున్న ప్రాజెక్టులు మాత్రం ఊహించని స్థాయిలో డిజాస్టర్ గా నిలిచాయి.ఇటీవల ఆమె నటించిన కస్టడీ సినిమా సైతం భారీ డిజాస్టర్ గా మిగిలింది. దీంతో కృతి శెట్టి కొత్త స్టార్ హీరోయిన్లతో పోటీ పడడం కష్టమే అని అంటున్నారు నటిజన్స్ .ఈ నేపద్యంలోనే ఈమెకి సంబంధించిన ఒక వార్త  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

అయితే తాజాగా ఈమెకి ఒక భారీ అవకాశం వచ్చినట్లుగా తెలుస్తోంది. ఏకంగా పాన్ ఇండియా ఆ సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుందట ఈ భామ. మలయాళం హీరో టీవీనో థామస్ హీరోగా జితిన్ లాల్ అజయంతే రంగం మోషణం అనే సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తీస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి మరియు ఐశ్వర్య రాజేష్ ని ఎంపిక చేశారట చిత్రం బృందం. ఇక ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని ఇటీవల నాచురల్ స్టార్ నాని విడుదల చేయడం జరిగింది. మాతృభాషలో ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ తెలుగులో మాత్రం అంత వైరల్ అవ్వలేదు.

దీంతో ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరి నటిస్తున్నారు అన్నది ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఇక ప్రతి నటిస్తున్న ఈ సినిమా ఒక విభిన్నమైన యాక్షన్ త్రిల్లర్ సినిమాట. ఇక ఈ ట్రైలర్లో హీరో క్యారెక్టర్ చాలా రగడగా హైలైట్ అయింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ హీరో ఇటీవల విడుదలైన 2018 సినిమాతో దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాడు. ఇక ఈ సినిమా పాత లెవెల్లో ఊహించని వసూళ్లను అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో సైతం విడుదల చేయబోతున్నారు. దీంతో ఈ హీరో పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: