ఆ వ్యక్తి తో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ కి పెళ్లిడు వచ్చింది.గత కొంతకాలంగా కీర్తి సురేష్ కి సంబంధించిన ఎఫైర్ రూమర్స్ చాలానే వినిపిస్తున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ని కీర్తి పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్తలు వచ్చాయి. దాని తర్వాత ఒక స్టార్ హీరో తో కీర్తి ప్రేమాయణం నడుస్తుందని అన్నారు. అంతేకాదు తన క్లాస్మేట్ తో కీర్తి ప్రేమలో ఉందని గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు అన్న వార్తలు సైతం వచ్చాయి. అంతేకాదు అతనితో పెళ్లికి కూడా సిద్ధమైందని కూడా అన్నారు. ఇక ఒకానొక సందర్భంలో ఈ వార్తలను ఆమె తల్లి ఖండించారు. 

ఇదిలా ఉంటే ఇక మరో వార్త వినబడుతోంది. కీర్తి సురేష్ ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆ ఫోటో చూసిన వారందరూ కీర్తి కి కాబోయే భర్త అతడే అంటూ కొత్త కథనాలు వెలువడ్డాయి. అది తాజాగా ఆ వార్తలు అన్నింటిపై కీర్తి సురేష్ స్పందించింది. ఈసారి నా బెస్ట్ ఫ్రెండ్ ని ఈ వార్తల్లోకి లాగారా.. నా జీవితంలో మిస్టరీ అంటూ ఎవరూ లేరు.. ఉన్నప్పుడు మీకు పరిచయం చేస్తాను.. అప్పటివరకు కొంచెం ఓపిక పట్టండి..ఇప్పటివరకు నా పెళ్లి వార్తలపై ప్రతిసారి తప్పుడు వార్తలే రాశారు.. అంటూ చెప్పుకొచ్చింది కీర్తి సురేష్ .దీంతో ప్రస్తుతం కీర్తి సురేష్ చేసిన కామెంట్స్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అంతేకాదు నేను ఇంకా ఎవరినీ నా జీవిత భాగస్వామిగా ఎంచుకోలేదు. ఇప్పటివరకు ఎవరిని ఇష్టపడలేదు.. అది జరిగినప్పుడు ఖచ్చితంగా మీ అందరికీ చెబుతాను.. అంటూ చెప్పుకొచ్చింది కీర్తి సురేష్.ఈమె సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించి హిట్స్ అందుకుంది ఆమె. సర్కారు వారి పాట దసరా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కీర్తి .ఇక ఈ రెండు సినిమాల్లో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాయి. దీంతో ఇప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది కీర్తి. ప్రస్తుతం తెలుగు తో పాటు తమిళ భాషలో సైతం అరడజను కు పైగానే సినిమా ల్లో నటించబోతోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది కీర్తి సురేష్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: