మొదటిసారి అలాంటి సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాజల్..!?

Anilkumar
చందమామ కాజల్ అగర్వాల్ ఘోస్టీ తర్వాత మళ్లీ ఇప్పుడు పోలీస్ పాత్రలో కనిపించబోతుంది. అయితే కాజల్ ఈసారి ఏకంగా ఐపీఎస్ ఆఫీసర్గా కనిపించబోతుందని సమాచారం వినబడుతుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ లేడి ఓరియంటెడ్ కథాంశంతో తెలుగులో ఒక సినిమా చేయబోతుంది. ఇక ఈ సినిమాతో అఖిల్ అనే కొత్త దర్శకుడు టాలీవుడ్ కి పరిచయం కానున్నాడు. ఈ సినిమాని గూఢచారి దర్శకుడు శశికిరణ్ తిక్క తన సోదరుడు చంద్రమోహన్ తో కలిసి ఈ సినిమాని నిర్మించిపోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే శశికిరణ్ నిర్మాతగానే కాకుండా ఈ సినిమాకు స్క్రీన్ ప్లే కూడా సమకూర్చబోతున్నట్లుగా తెలుస్తోంది. యాక్షన్ త్రిల్లర్ కదాంశం తో ఈ సినిమా రాబోతుందట. 

ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ఐపీఎస్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. అయితే ఈ సినిమాలోని పోలీస్ పాత్ర కోసం దర్శక నిర్మాతలు చాలా రీసెర్చ్ చేశారట. ఈ సినిమా కోసం నిజమైన లేడీ పోలీస్ ఆఫీసర్స్ ను కలిసి ఈ సినిమాలో నటించబోయే కాజల్ క్యారెక్టర్ ను చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు కాజల్ సైతం పోలీస్ పాత్ర కోసం ప్రత్యేకంగా సిద్ధమవుతోందట. అంతేకాదు ఈ నెలలోనే ఈ సినిమా ఓపెనింగ్ కూడా భారీగా నిర్వహించబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జూన్ లోనే మొదలుపెట్టబోతున్నారట.

ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా రాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఆ సినిమాలో బాలయ్య కి జోడిగా కాజల్ నటిస్తోంది. ఇక ఈ సినిమా తో కాజల్ మొదటిసారిగా బాలకృష్ణ హీరోయిన్గా నటిస్తోంది .ఈ సినిమాలతో పాటు కాజల్ కమలహాసన్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ప్రెస్టీజియస్ సీక్వెల్ ఇండియన్ టు సినిమాలో సైతం హీరోయిన్ గా కనిపించబోతోంది. దింతో పాటు తమిళ హిందీ సినిమాల్లో సైతం కాజల్ నటించేందుకు రెడీగా ఉన్నట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: