ఆ స్టార్ డైరెక్టర్ తో తన 109 వ సినిమా ఫిక్స్ చేసిన బాలయ్య..!?

Anilkumar
నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం బాలయ్య కుర్ర హీరోలతో ఏమాత్రం తగ్గకుండా వారికి పోటీగా వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ సాధిస్తున్నాడు. ఇటీవల అఖండ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య. తాజాగా ఇప్పుడు వీర సింహారెడ్డి సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.మళ్ళీ ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు బాలయ్య. గత కొంతకాలంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. 
ఇక ఈ సినిమాలో బాలకృష్ణకి జోడిగా చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తోంది.

ఆమెతోపాటు యంగ్ హీరోయిన్ శ్రీ లీల సైతం ఒక కీలక పాత్రలో నటిస్తోంది.  బాలకృష్ణ కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా పక్కా తెలంగాణ నేపథ్యంలో భారీ యాక్షన్ డ్రామాగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సినిమాలో బాలకృష్ణ చాలా ఇంటెన్స్ పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ఇక అసలు విషయం ఏంటంటే.. ఈ సినిమా తర్వాత బాలయ్య ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు అన్నది  ఆసక్తిగా మారింది .బాలయ్య తన 109వ సినిమాని దర్శకుడు బాబితో చేయబోతున్నారని ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవల టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్య సినిమాను చేశాడు బాబి. ఇక ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో భారీ విజయని అందుకున్న బాబి ఇప్పుడు బాలయ్యతో తన తదుపరి సినిమాని చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే బాలయ్య డైరెక్టర్ బాబి దర్శనత్వంలో బాలయ్య 109వ సినిమా రాబోతుంది అన్న దాంట్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ తన 109వ సినిమా అని ఒక బడా డైరెక్టర్ తో చేయబోతున్నట్లుగా ఇప్పుడు తెలుస్తుంది. బాలకృష్ణ తన 109 సినిమాని బావితో చేయట్లేదని బోయపాటి శ్రీను తో తన సినిమాని చేయబోతున్నట్లుగా సమాచారం. అంతేకాదు ఈ సినిమాకి సంబంధించిన అన్ని చర్చలు కూడా జరిగాయని బోయపాటి వచ్చేవరకు బాలకృష్ణ వెయిట్ చేస్తారని అంటున్నారు. ఇక బోయపాటి బాలయ్య సినిమా తర్వాత బాబీ దర్శకత్వంలో బాలయ్య సినిమా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయట..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: