పవన్ కళ్యాణ్ వేసుకున్న ఈ షూస్ ధర తెలిస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే..!?

Anilkumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో 'బ్రో' సినిమా కూడా ఒకటి.మెగా మేనల్లుడు సాయిధరం తేజ్ తో కలిసి పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ మెగా మల్టీస్టారర్ సినిమాను దర్శక నటుడు సముద్రఖని దర్శకత్వంలో రాబోతోంది. త్రివిక్రమ్ సంభాషణలు స్క్రీన్ ప్లే తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ జి స్టూడియోస్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ కి జోడిగా కేతిక శర్మ హీరోయిన్గా నటించబోతోంది. ఇక తమిళంలో సముద్రఖని నటించడంతోపాటు దర్శకత్వం వహించిన వినోదయ సీతం సినిమాకు రీమేగా ఈ సినిమా రాబోతుంది. 

ఇక ఈ సినిమాలో దేవుడి పాత్రలో పవన్ కళ్యాణ్ యాక్సిడెంట్లో మరణించి మళ్లీ బ్రతికి వరం పొందిన యువకుడిగా సాయి తేజ్ కనిపిస్తారట. అయితే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ని రెండు రోజుల క్రితమే ఎనౌన్స్ చేశారు.దానితోపాటు మోషన్ పోస్టర్ను కూడా విడుదల చేశారు చిత్ర బృందం. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లుక్ సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. అందులో పవన్ కళ్యాణ్ బ్లాక్ షూస్ బ్లాక్ డ్రెస్ వేసుకొని రెండు చేతులను స్టైల్గా షాపుతో జల్సా సినిమా రేంజ్ లో ఫోజులు ఇచ్చి అందరిని ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే ఇక ఈ మోషన్ పోస్టర్లో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ధరించిన షూస్ ఇప్పుడు అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి.

దాంతో పవన్ కళ్యాణ్ వేసుకున్న ఆ షూ స్ ని ఆన్లైన్ లో వెతికే పనిలో పడ్డారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఇక కొనుక్కుందామని అనుకుని ఆన్లైన్ లో చూసేసరికి నేటిజన్స్ దిమ్మ తిరుగుతోంది. పవన్ కళ్యాణ్ వేసుకున్న ఆ షూస్ ధర చూసి అందరూ షాక్ అవుతున్నారు.అయితే పవన్ కళ్యాణ్ వేసుకున్న ఆ షూస్ ధర అమెరికన్ డాలర్ల ప్రకారం 1200. ఇక ఆధార చూసి సామాన్యులు షాక్ అవుతున్నారు.కాళ్లకు వేసుకునే షూస్ కోసం అన్ని లక్షలు ఖర్చు చేయాలా అంటూ షాక్ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న బ్రో సినిమా జులై 28న విడుదల కాబోతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: