ఆ తేదీ నుండి మహేష్... త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభం..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు ఆఖరుగా సర్కారు వారి పాట సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయం అందుకుంది. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ... పరుశురామ్ ఈ మూవీ కి దర్శకత్వం వర్ధించాడు. సముద్ర ఖని విలన్ పాత్రలో నటించిన ఈ మూవీ కి తమన్ సంగీతం అందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు అందుకొని మంచి విజయాన్ని సాధించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మహేష్ తన కెరియర్ లో 28 వ సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

ఈ మూవీ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... శ్రీ లీల ... పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ని హారిక ఆయన హాసిని క్రియేషన్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కొంత భాగం పూర్తయింది. తాజాగా ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ కు సంబంధించిన ఒక క్రేజీ వార్త బయటకు వచ్చింది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ జూన్ 7 వ తేదీన ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ మూవీ లోని ఈ షెడ్యూల్ చాలా రోజుల పాటు కొనసాగన్నట్లు ... ఈ షెడ్యూల్ లో ఈ మూవీ బృందం ఈ సినిమాలోని చాలా ఇంపార్టెంట్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో యాక్షన్ సన్నివేశాలు మరియు సెంటిమెంట్ సన్నివేశాలు చాలా కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: