మరో ప్లాప్ సినిమా నుండి తప్పించుకున్న విజయ్ దేవరకొండ..!?

Anilkumar
టాలీవుడ్ రౌడీ హీరో గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ త్రుటిలో మరొక ఫ్లాప్ సినిమా నుండి తప్పించుకున్నాడు. లేదంటే ఆయన ఖాతాలో ఇంకొక పెద్ద డిజాస్టర్ సినిమా వచ్చేది. అయితే ఆమె నిర్ణయమే ఈ యంగ్ హీరోను కాపాడిందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇక ప్రస్తుతం వరుస ఫ్లాప్స్ అందుకుంటున్నాడు. సినిమాల విడుదలకు ముందు ఒకలాగా రిలీజ్ తర్వాత ఒకలాగా అన్నట్టు ఆయన పరిస్థితి ఉంది.  ఇక నువ్విలా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాల్లో కీలక పాత్ర పోషించి మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. తర్వాత పెళ్లిచూపులో సినిమాతో హీరోగా సక్సెస్ అయ్యాడు విజయ్. 

దాని అనంతరం అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరో రేంజ్కి ఎదిగాడు. ఆ తర్వాత గీతగోవిందం వంటి సినిమాలతో వరుస విజయాలను అందుకున్నాడు. కానీ స్టార్ హీరోగా మాత్రం నిలవలేకపోయాడు విజయ్. ఈ సినిమాల తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ కూడా వరుసగా ప్లాప్ లు అవుతూ వచ్చాయి. అయితే ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ చేయాల్సిన ఒక ప్రాజెక్ట్ తాజాగా విడుదలై ఫ్లాప్ గానే నిలిచింది.లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన అన్ని మంచి శకునాలే సినిమా మొదట విజయ్ దేవరకొండ తో చేయాలని అనుకున్నారు. కథ నచ్చడంతో సినిమా చేయడానికి విజయ్ సైతం ఒప్పుకున్నాడు.

అయితే ఈ సినిమా అర్జున్ రెడ్డి సినిమా కంటే ముందే ప్రారంభం కావాల్సి ఉంది. ఇక అర్జున్ రెడ్డి సినిమాతో ఆయన క్రేజ్ మారిపోవడంతో నందిని రెడ్డి విజయతో ఈ సినిమా వర్కౌట్ కాదని భావించి సంతోష్ తో ఈ సినిమాను తీసింది. నిన్న విడుదలైన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. దీంతో ఏ వార్త విన్న విజయ్ ఫ్యాన్స్ విజయ్ దేవరకొండ ఈ సినిమా గనక చేసి ఉంటే కచ్చితంగా ఆయన ఖాతాలో మరొక ఫ్లాప్ సినిమా పడేదిని అంటున్నారు. నందిని రెడ్డి నిర్ణయంతో విజయ్ దేవరకొండ బతికిపోయాడు అని అభిప్రాయపడుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: