చేతులారా ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్న తమన్నా..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు .ఈ వయసులో కూడా మిల్కీ బ్యూటీ తమన్న బ్యాక్ టు బ్యాక్ సినిమాలో చేస్తూ బిజీబిజీగా ఉంది. ప్రస్తుతం ఈమె చేతిలో భోళా శంకర్, జైలర్ వంటి బడా సినిమాలో ఉన్నాయి. వాటితో పాటు బాలీవుడ్లో సైతం పలు ప్రాజెక్టులకు గ్రీన్ సీనల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా ఈమెకి ఒక ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చిన సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న #NBK108 సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్న కి ఈ ఆఫర్ వచ్చింది. 

ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంటే శ్రీ లీల మరొక కీలకపాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఇక నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా ఈ సినిమా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాలో ఒక మాస్ మసాలా ఐటెం సాంగ్ ఉండబోతుందట. ఇక ఆ సినిమా కోసం ఐటెం సాంగ్ కోసం తమన్న ఏకంగా కోటిన్నర రెమ్యూనరేషన్ అడిగిందట. తమన్నా డిమాండ్ విని ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన మేకర్స్ రెమ్యూనరేషన్ తగ్గించాలని కోరాడట. కానీ అందుకు తమన్నా మాత్రం ఏమాత్రం ఒప్పుకోలేదట.

దాంతో తమన్నాను కాదని బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయను ఈ ఐటెం సాంగ్ కోసం తీసుకున్నట్లుగా తాజగా ఒక సమాచారం వినబడుతుంది. ఇప్పటికే అనసూయతో సంప్రదింపులు కూడా పూర్తి జరిగినట్లుగా సమాచారం .ఇక ఈ విషయం తెలిసి రెమ్యూనరేషన్ విషయంలో అతి చేయకపోతే ఆ సినిమాలో నువ్వే ఐటెం సాంగ్ చేసే దానివి అంటూ ఈ వార్త తెలిసిన తమన్న అభిమానులు మరియు సినీ ప్రేక్షకుల సైతం కామెంట్స్ చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: