రెమ్యునరేషన్ తో.. రికార్డ్స్ సృష్టిస్తున్న విజయ్ దళపతి?

praveen
తమిళ్ తో పాటు సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు విజయ్ దళపతి. ఈయనకు మామూలు క్రేజ్ ఉండదు. ప్రస్తుతం కోలీవుడ్ పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతూ తనకంటూ ఎంతో చక్కటి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. తెలుగులో కూడా విజయ్ కి బాగానే ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన ఒక సినిమా తీస్తున్నాడు అంటే తెలుగు తెలుగు అభిమానుల సైతం ఆ చిత్రం గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం విజయ్యో లియో అనే చిత్రంలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వ వహిస్తుండగా 17 ఏళ్ల తర్వాత. త్రిష విజయతో జోడి కడుతోంది. ఈ సినిమాకి ఇప్పటికే ఫస్ట్ గ్లిమ్ప్స్ ద్వారా విపరీతమైన హైప్  వచ్చింది.

 అయితే లియో సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ తరుణంలో తన తదుపరి సినిమా గురించి కూడా విజయ్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ సినిమా ఏంటి అనే విషయం ప్రస్తుతం బయటకు వచ్చి వైరల్ గా మారింది. తెలుగులో నాగ చైతన్య, కృతి శెట్టి జంటగా నటించిన చిత్రం కస్టడి. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన సంగతి కూడా మన అందరికీ తెలిసిందే.

దీనిని కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్టు చేయగా,  ఈ దర్శకుడి  తోనే విజయ్ తన తదుపరి సినిమాలో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏకంగా 150 కోట్ల రూపాయల పారితోషకం సైతం విజయ్ కి ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. వెంకట ప్రభు తో కలిపి జి ఎస్ ఎంటర్టైన్మెంట్ వారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఇప్పటికే ప్రతి సినిమాకి 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకునే విజయ్ ఇప్పుడు 150 కోట్ల రూపాయలు తీసుకుంటుండటం తో  టాలీవుడ్ తర్వాత సౌత్ ఇండియాలోనే అత్యంత ఎక్కువ పారితోషకం తీసుకునే హీరోల్లో విజయ్ చేరిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: