సాయి పల్లవి మేకప్ వేసుకున్నా డైరెక్టర్స్ తీసేయమంటారట..!
అయితే సాయి పల్లవిని ఒకవేళ ఎవరైనా డైరెక్టర్ మేకప్ వేసుకోమని చెప్పినా ఆమె తప్పక వేసుకున్నా సరే మేకప్ వల్ల ఆమె న్యాచురల్ లుక్స్ మిస్ అవుతున్నాయని ఆమెను మేకప్ లేకుండానే తన ఒరిజినల్ లుక్స్ తోనే నటించాలని కోరతారట. మొత్తానికి అలా తన సహజ అందంతో సాయి పల్లవి ప్రేక్షకులను అలరిస్తుంది. తెలుగులో ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు చేయగల క్రేజ్ ఉన్న సాయి పల్లవి సినిమాల సెలక్షన్స్ లో ఆచి తూచి అడుగులేస్తుంది.
అంతేకాదు స్టార్ సినిమాల్లో నటించడానికి ఓకే కానీ తన పాత్ర ప్రాధాన్యత ఉండాల్సిందే అంటూ అమ్మడు అంటుంది. మలయాళం ప్రేమంతో తెరంగేట్రం చేసిన సాయి పల్లవి తెలుగులో స్టార్ క్రేజ్ తెచ్చుకుంది. మిగతా భాషల్లో నటిస్తున్నా సరే ఆమెకు తెలుగు లో వచ్చిన పాపులారిటీ మాత్రం రాలేదు. తెలుగు ఆడియన్స్ ఆమెను లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ కూడా ఇచ్చారంటే అమ్మడి క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. రాబోయే సినిమాలతో కూడా సాయి పల్లవి తన మార్క్ నటనతో ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు.