రామ్ చరణ్, ఎన్టీఆర్ లకి మరో అరుదైన గౌరవం..!?

Anilkumar
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా విడుదలై దాదాపుగా సంవత్సరం పైనే కావస్తుంది. ఇక ఈ సినిమా ఆస్కార్ అవార్డ్ సైతం గెలిచింది.ఈ సినిమాలోని నాటు నాటు  పాటకి అత్యుత్తమ పురస్కారం ఆస్కార్ లభించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికి ఈ సినిమా ప్రభంజనం అస్సలు తగ్గలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు జపాన్లో కొమరం భీమ్ రామరాజు ఇప్పటికీ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఇక దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వహించిన ఈ సినిమా అంతర్జాతీయంగా ఆస్కార్ గోల్డెన్ గౌడ్ సహా ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులను గెలుచుకుంది .

అయితే తాజాగా జపాన్లో త్రిబుల్ ఆర్ హీరోలైన రామ్ చరణ్ ఎన్టీఆర్ లక్కీ ఒక అరుదైన గౌరవం లభించినట్లుగా తెలుస్తోంది. అయితే జపాన్లో అత్యంత పాపులర్ మ్యాగజిన్ ఆన్ ఆన్ కవర్ పేజీ పై రామ్ చరణ్ ఎన్టీఆర్ ఫోటోలు అన్ని ప్రచురించినట్లుగా తెలుస్తోంది.అయితే త్రిబుల్ ఆర్ హీరోలైన రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లకి దక్కిన అత్యంత అరుదైన గౌరవం ఇది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే ఈ ఫీట్ సాధించడంతో త్రిబుల్ ఆర్ ఫ్యాన్స్ రామ్ చరణ్ ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ఇప్పటికే త్రిబుల్ ఆర్ సినిమా జవాన్ లో వన్ బిలియన్ యోన్ వసూలు చేసింది.

 అంతేకాదు ఇప్పటికీ త్రిబుల్ ఆర్ సినిమా కోసం జపాన్ వాసులు ఎగబడి చూస్తున్నారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ గా మారింది. ఇకపోతే కీరవాణి సంగీతం చంద్రబాబు లిరిక్స్ వాటితో పాటు చరణ్ ఎన్టీఆర్ డాన్స్ మూమెంట్స్ తో నాటు నాటు పాట వాళ్ళు వైడ్ గా ఎంతో క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక అదే జోరులో ఆస్కార్ను గెలుచుకొని వచ్చారు త్రిబుల్ ఆర్ చిత్ర బృందం. అంతేకాకుండా ఈ సినిమాతో రాజమౌళికి దర్శకుడిగా ఎంత మంచి పేరు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజమౌళి తో పాటు ఈ సినిమాలో హీరోలుగా నటించిన రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ సైతం వరల్డ్ వైడ్ గా మంచి గుర్తింపు లభించింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: