ఆ స్టార్ హీరోతో ప్రేమలో ఉన్న అనన్య.. సీక్రెట్ రివీల్ చేసిన రణబీర్ కపూర్.. !?

Anilkumar
లైగర్ సినిమాతో టాలీవుడ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమాతో ఆమె ఎంట్రీ ఇచ్చినప్పటికీ అనుకున్న స్థాయి లో క్రేజ్ సంపాదించుకోలేకపోయింది అనన్య. కానీ టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం ఆమెకి సంబంధించిన ప్రతి ఒక అప్డేట్ ను ఎప్పటికప్పుడు ఫాలో అవుతూనే ఉంటారు. దీంతో తాజాగా అనన్య రిలేషన్షిప్ స్టేటస్ లకి సంబంధించిన కొన్ని వార్తలు బయటికి వచ్చాయి. స్టార్ మేకర్ కరణ్ జోహార్ కాంపౌండ్ నుండి స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ పరిచయమైంది. తొలి మల్టీస్టారర్ సినిమా కావడంతో ఆమెకి ఆశించిన స్థాయిలో క్రేజ్ రాలేదు.

దాని తర్వాత పతిపత్ని ఔర్ ఓ, అంగ్రేజీ మీడియా ఖాళీ వండి సినిమాలు చేసినప్పటికీ హీరోయిన్ గా స్టార్ ఇమేజ్ మాత్రం దక్కలేదు. ఇక అక్కడ ఎన్ని సినిమాలు చేసినా స్టార్ హీరోయిన్ గుర్తింపు రాకపోవడంతో ఇక్కడున్న సౌత్ హీరోలను నమ్ముకుంది ఈ నార్త్ అమ్మడు. సినిమాలో విజయ్ దేవరకొండకు జోడిగా పాన్ ఇండియా సినిమాలో నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది అనన్య. ఈ సినిమాలో నటిస్తే తన కెరియర్ గ్రాఫ్ పెరుగుతుంది అనుకున్న అనన్యకుఈ సినిమా ఊహించని షాక్ ఇచ్చింది. భారీ అంచనాల విడుదలైన ఈ సినిమా ఊహించని స్థాయిలో డిజాస్టర్ గా మిగిలింది. దీంతో సౌత్ లో హీరోయిన్ గా మారాలి అనుకున్న ఈమె ఆశలు కాస్త నిరాశలుగా మిగిలాయి.

సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అన్న సంగతి పక్కన పెడితే టాలీవుడ్ ఆడియన్స్ లో ఈమెకి క్రేజ్ బాగానే ఉంది. ఈమె సినిమాల అప్డేట్లతో పాటు రిలేషన్షిప్ స్టేటస్ ల గురించి కూడా ఆరా తీస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. ఇక తాజాగా ఈమెకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. తాజాగా ఈమె గురించి ఒక అప్డేట్ ఇచ్చాడు బాలీవుడ్ రణబీర్ కపూర్. ఆదిత్య రాయ్ కపూర్ అనన్యల మధ్య ఏదో ఉంది అన్న టాక్ ఎప్పటినుండో వినిపిస్తుంది. అంతేకాదు ఈ మధ్య లేట్ నైట్ డిన్నర్ పార్టీలో సైతం ఈ జంట కనిపిస్తుంది. దీంతో బాలీవుడ్ మీడియా వీళ్లిద్దరిపై ఫుల్ ఫోకస్ పెట్టింది. వీరిద్దరి మధ్య ఖచ్చితంగా ఏదో నడుస్తుంది అన్న ప్రచారాలు సైతం జరుగుతున్నాయి. తాజాగా ఈ వార్తలకు మరింత బలం చేకూర్చారు రణబీర్ కపూర్.ఆదిత్య కు గర్ల్ ఫ్రెండ్ ఉంది అన్నమాట నిజమే అంతేకాదు ఆ అమ్మాయి పేరు A  లెటర్ తో స్టార్ట్ అవుతుంది అంటూ హింట్ ఇచ్చాడు రణబీర్ కపూర్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: