ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా నన్ను దారుణంగా హించించారు.. కాజల్ షాకింగ్ కామెంట్స్..!?

Anilkumar
టాలీవుడ్ లో చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ ముద్ర వేసుకుంది అందాల చందమామ కాజల్ అగర్వాల్. తెలుగులోనే కాకుండా తమిళ భాషలో సైతం స్టార్ హీరోల సరసన ఆడి పాడింది. ఇక అలా ఫామ్ లో ఉన్న సమయంలో పెళ్లి పీటలెక్కింది.2020లో తన క్రియాసకుడు ముంబైలో స్థిరపడ్డ వ్యాపారవేత్త గౌతం కిచ్లు నీ ప్రేమ వివాహం చేసుకుంది కాజల్. ఇక పెళ్లి అయిన తర్వాత కొద్ది నెలలకి తల్లి అయ్యింది.అలా ప్రెగ్నెంట్ కావడంతో నటనకు కాస్త బ్రేక్ ఇచ్చింది కాజల్. అనంతరం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇక అలా బిడ్డకు ఆరు నెలల వయసు రాగానే మళ్ళీ సినిమాలపై  ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది కాజల్. 

అయితే అలా సినిమాలో చేస్తు బిజీగా ఉన్న సమయంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు..ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ నేను ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు చాలామంది విమర్శలను నేను విన్నాను.. కనీసం కడుపుతో ఉన్నారని కూడా చూడకుండా లావుగా అయ్యాను.. అంటూ రకరకాలుగా నన్ను చాలామంది విమర్శించారు.. అంతేకాదు బాడీ షేవింగ్ కామెంట్స్ అయితే చాలా దారుణంగా పెట్టి హింసించేవారు.. అంటూ ఎమోషనల్ అయింది కాజల్. అనంతరం బిడ్డ పుట్టిన చాలా తక్కువ సమయంలోనే మళ్లీ సినిమాలు చేస్తున్నాను అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసింది కాజల్.

అనంతరం నా కొడుకుని ఉన్నత స్థాయిలో తీర్చిదిద్ది గొప్పతల్లిగా నేను కావాలని అనుకుంటున్నాను. ఇలాంటి వారికి కచ్చితంగా బుద్ధి చెప్పాలి అని అప్పుడే నిర్ణయం తీసుకున్నాను అంటూ పేర్కొంది కాజల్. ఇక కాజల్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈమె బాలయ్య సరసన ఎన్.బి.కె 108 సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. దానితోపాటు తమిళంలో కమలహాసన్ తో ఇండియన్ టు సినిమాలో సైతం నటిస్తోంది. మరి కొన్ని ప్రాజెక్టులు కూడా ఆమె చేతిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో కాజల్ కి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: