బాలయ్య సినిమాలో ఆ స్టార్ హీరోయిన్ ఐటెం సాంగ్.. రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!?

Anilkumar
నట సింహం నందమూరి బాలకృష్ణ ... సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. బాలయ్య కెరియర్లో తెరకెక్కుతున్న 108వ సినిమా ఇది. దీంతో ఈ సినిమాకి ఎన్బికే 108 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను ప్రారంభించారు చిత్ర బృందం. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణకి జంటగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. దాంతోపాటు యంగ్ బ్యూటీ శ్రీ లీల తో పాటు బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు.షైన్ స్క్రీన్ బ్యానర్  పై సాహో గారపాటి హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. 

ఇప్పటికే రాయలసీమ యాసలో అందరినీ ఆకట్టుకున్న బాలయ్య ఎన్.బి.కె 108 సినిమాలో కచ్చితంగా తెలంగాణ యాసలో అందరినీ మైమరిపిస్తారని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా జరుగుతోంది.అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమాలో ఒక మాస్ మసాలా ఐటెం సాంగ్ ఉండబోతుందని అంటున్నారు. అయితే ఈ సినిమా కోసం తాజాగా చిత్ర బృందం మిల్కీ బ్యూటీ తమన్నను సంప్రదించడం జరిగింది. ఈ సినిమాలో బాలయ్య తో ఆడి పాడేందుకు తమన్నా భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుండగా తెలుస్తోంది.

సాధారణంగా ఏ సినిమాలోనైనా ఒక పాటను రెండు మూడు రోజుల్లో కంప్లీట్ చేస్తారు. అయితే ఈ రెండు మూడు రోజుల కోసం తమన్న ఏకంగా  1.50 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది.దీంతో తమన్నా రెమ్యూనరేషన్ డిమాండ్ ను చూసిన మేకర్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారట.అయినప్పటికీ తమన్న కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకున్న చిత్ర బృందం తమన్నా ఎంత అడిగినా ఇచ్చేందుకు ఒప్పుకున్నారట. అంతే కదా త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్లోకి ఐటమ్ సాంగ్ కూడా చిత్రీకరించబోతున్నారు. అంతేకాదు ఈ పాట కోసం ఒక స్పెషల్ సెట్ ను సైతం ఏర్పాటు చేస్తున్నారట. ఇక ఈ సినిమా దసరా కానుకగా భారీ అంచనాలతో విడుదల కాబోతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: