అలా కనిపించడం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న కృతి శెట్టి.. కానీ..!?

Anilkumar
ఉప్పెన సినిమాతో టాలీవుడ్ సినీఇండస్ట్రీకి పరిచయం అయింది కృతి శెట్టి. ఈ సినిమాతో బెబమ్మగా కుర్రకారుల మనసును దోచుకుంది ఈమె. ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్  స్టార్ డం ను దక్కించుకుంది ఈమె. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దీంతో ఈమె రేంజ్ ఊహించని స్థాయికి చేరుకుంది. ఊహించని హ్యాట్రిక్ హిట్ సినిమాలతో రాకెట్ లాగా దూసుకుపోయింది ఉప్పెన బ్యూటీ .ఈ సినిమా తర్వాత ఏమైందో తెలియదు గానీ కృతి శట్టి ని వరుసగా ఫ్లాప్ సినిమాలో వెంటాడుతున్నాయి .చివరగా ఏమి హీరోయిన్గా నటించిన నాలుగైదు సినిమాలు అన్నీ కూడా డిజాస్టర్ గా మిగిలాయి. 

దీంతో కృతి శెట్టి కెరియర్  ఇప్పుడు ఎటు వెళ్తుందో చూడాలి. ఒకవైపు సినిమాలో వరుసగా ఫ్లాప్స్ అవుతుండడంతో సతమతమవుతున్న కృతి శెట్టికి మరోవైపు ట్రోల్స్ పేరిట విమర్శలు సైతం అదే స్థాయిలో ఎదురవుతున్నాయి. అయితే ఈ మధ్య కృతి శెట్టి ముఖంలో కాస్త మార్పులు కనిపిస్తున్నాయి. దీంతో ఆమె ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా ఆమెపై వస్తున్న రూమర్స్ పై.ఘాటుగా స్పందించింది కృతి శెట్టి. ఆమె మాట్లాడుతూ..ఇలాంటిది ఎవరు రాస్తారో ఎందుకు రాస్తారో కూడా అర్థం కాదు.. మాకు కూడా కుటుంబాలు ఉంటాయి. 

ఇక ఇలాంటి రూమర్స్ విన్న ప్రతిసారి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది.. ఉప్పెన సినిమాలో ఉన్నట్లుగా ఇప్పుడు లేను అని అందరూ అంటున్నారు.. అందరూ ఎప్పుడు ఒకేలా ఉండరు ..ఉండలేము.కూడా.. మనలో ఉన్న ఫీచర్స్ మారుతాయి.. అలాగే అందరిలా నేను కూడా కొన్నిసార్లు మేకప్ వల్ల కొన్ని సార్లు హెయిర్ స్టైల్ వల్ల కూడా ముఖంలో మార్పులు కనిపిస్తాయి.. అంతమాత్రాన ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటారా అంటూ ఆమెపై వస్తున్న ట్రోలింగ్స్ పై ఫైర్ అయింది కృతి శెట్టి.దీంతో కృతి శెట్టి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: