పవన్ ఫాన్స్ కి గుడ్ న్యూస్.. 'OG' సినిమా రిలీజ్ అప్పుడేనట..!?

Anilkumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో OG అనే సినిమా రాబోతున్న సంగతి ఏమన్న అందరికీ తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతుంది. గ్యాంగ్ స్టార్ లుక్ లో పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో కనిపిస్తూనే వస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ అభిమాని కావడంతో డైరెక్టర్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. డి వి బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు .పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ కూడా ఉండబోతున్నట్లుగా సమాచారం. 

కాగా ఈ సినిమాలో ప్రియాంక ఆరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. పవన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రెండు భారీ షెడ్యూల్ షూటింగ్స్ సైతం పూర్తి అయ్యాయి. దీంతో ఈ సినిమాని ఈ ఏడాది డిసెంబర్ నెలలో క్రిస్మస్ పండుగ కానుకగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట చిత్ర బృందం. ప్రస్తుతం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ నటించిన రెండు సినిమాలు ఈ ఏడాదిలోనే విడుదల కాబోతున్నాయి.క్రిష్  దర్శకత్వంలో రాబోతున్న హరిహర వీరమల్లు తరువాత సముద్రఖని దర్శకత్వంలో సాయంత్రం తేజ్ మల్టీ స్టార్ సినిమాలు సైతం ఒకేసారి విడుదల కానున్నాయి.

ఆ తర్వాత సంక్రాంతి కానుకగా హరీష్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అంటే.. దాదాపుగా ఈ మూడు సినిమాలు వరుసగా రాబోతున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఒకవేళ ఇదే గనక జరిగితే జూన్ నుండి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనే బిజీగా కానున్నాడు. ఒకవేళ ముందే వస్తే ఆంధ్రప్రదేశ్ లో నవంబర్ నెలలో ఎన్నికలు జరిగితే జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీగా ఉన్నారు. దీంతో తదుపరి సినిమాలో షూటింగ్స్ సైతం వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: