ఆ బడా వ్యాపారవేత్త తో కీర్తి సురేష్ ప్రేమాయణం.. త్వరలోనే పెళ్లి..!?

Anilkumar
నటి మేనక,నిర్మాత సురేష్ ల వారసురాలిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది కీర్తి సురేష్ నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. చాలా తక్కువ కాలంలోనే జాతీయ ఉత్తమ నటి అవార్డును సైతం సొంతం చేసుకుంది కీర్తి సురేష్.మొదట్లో బాలీవుడ్లో నటిగా ఎంట్రీ ఇచ్చింది ఈమె. దాని అనంతరం తమిళంలో పలు సినిమాల్లో నటించింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోవడంతో రెండవ చిత్రం రజిని మురుగన్ కీర్తి సురేష్ కి పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఆ సినిమా తర్వాత  కీర్తి సురేష్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అనంతరం మహానటి సినిమాతో టాలీవుడ్ లో దిగవంత నటి సావిత్రి పాత్రలో నటించి ఎందరో అభిమానులను తన సొంతం చేసుకుంది. 

దాంతోపాటు జాతీయ ఉత్తమ నటి అవార్డును సైతం గెలుచుకుంది. ఇక ఆ సినిమా తర్వాత పలు సినిమాల్లో గ్లామర్ పాత్రలలో సైతం నటించిన ఈమె తాజాగా దసరా సినిమాలు డి గ్లామర్ పాత్రలో నటించింది. ఈ సినిమాతో మరోసారి తన సత్తాను చాటింది కీర్తి సురేష్. ప్రస్తుతం ఏమేమి మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలిగా బోళాశంకర్ సినిమాలో నటిస్తోంది. టాలీవుడ్ లోనే కాకుండా తమిళంలో సైతం అనడంతో పైగానే సినిమాల్లో నటిస్తోంది. ఉదయనిది స్టాలిన్ కు జంటగా మారి సెల్వరాజ్ దర్శకత్వంలో నటించిన ఈమె ఆ సినిమా త్వరలోనే విడుదల కానుంది. అదేవిధంగా జయం రవి సరసన నటిస్తున్న సైరన్ సినిమా సైతం నిర్మాణ పనులు దశకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది.

ఈ సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ సినిమాలైన రివాల్వర్ రీటా, రఘు తాత సినిమాల్లో సైతం నటిస్తోంది కీర్తి సురేష్. అయితే ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నా ఈమెకి సంబంధించిన పెళ్లి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.30 ఏళ్ల వయసు దాటిన ఈమె ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నట్లుగా తాజాగా ఒక సమాచారం నిలబడుతోంది. ఇక నటి కీర్తి సురేష్ ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో షికారు చేస్తోందని అంటున్నారు. కాగా ఆయన పేరు ఫర్హానా బీన్ లేయాకత్ అని అంటున్నారు. ఇక ఆయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తట. ఇటీవల అతని పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక పోస్టును షేర్ చేసింది కీర్తి సురేష్. దీంతో వారిద్దరు కలిసి ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: