డిజాస్టర్ అఖిల్ ఏజెంట్ ఫైనల్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లు నష్టమో తెలుసా..!?

Anilkumar
అక్కినేని నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు అఖిల్. అక్కినేని అఖిల్ అఖిల్ అనే సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఇక ఈ సినిమా కమర్షియల్ గా పెద్దగా హిట్ అందుకోలేకపోయినప్పటికీ హీరోగా మాత్రం అఖిల్ కి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది .టాలీవుడ్ లో హీరోగా ప్రారంభం మొదలుపెట్టినప్పటి నుండి ఆయన నటిస్తున్న సినిమాలన్నీ కూడా వరుసగా అపజయాలను అందుకుంటూ వస్తున్నాయి. తాజాగా అఖిల్ ఏజెంట్ అనే సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక భారీ అంచనాల నడుమ విడుదలైన ఏజెంట్ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. 

ఈ సినిమా కంటే ముందు అఖిల్ హీరోగా నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా డిజాస్టర్లుగా మిగలడంతో కచ్చితంగా హిట్ కొట్టాలని ఈ సినిమా కోసం పెద్ద కష్టపడ్డాడు అఖిల్. కానీ ఎవరు ఊహించిన విధంగా ఈ సినిమా కూడా అక్కినేని అఖిల్ కి నిరాశ మిగిల్చింది. ఇక ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుండే ఊహించిన విధంగా నెగటివ్ టాక్ పెంచుకుంది. అంతేకాదు టాలీవుడ్ లోనే అత్యంత చెత్త సినిమాల్లో ఒకటిగా మిగిలింది. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదలైనప్పటి నుండి ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

ఫైనల్ గా అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమా థియేటర్లలో 10 కోట్లు కలెక్షన్స్ను కూడా రాబట్ట లేకపోయింది.ఇకపోతే ఈ సినిమా ఓవరాల్గా థియేటర్ ద్వారా 13.50 కోట్ల గ్రాస్ మరియు 6 కోట్ల 25 లక్షల కు పైగానే షేర్ వచ్చింది. కాగా అఖిల్ నటించిన ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ 36 కోట్లకు పైగానే జరిగినట్లుగా తెలుస్తోంది. దాంతో నిర్మాతలకు 30 కోట్లకు పైగా అనే నష్టాలను మిగిల్చిందట. అంతేకాదు తెలుగులో నిర్మాతలకు ఈ సినిమా భారీ నష్టాలను మిగిల్చిన సినిమాల్లో అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా కూడా ఒకటిగా నిలిచింది. ఇక ఈ సినిమా 19న సోనీ ద్వారా ఓటిటి ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలై డిజాస్టర్ గా మిగలడంతో థియేటర్లో విడుదలైన 20 రోజుల్లోనే ఓటీడీలోకి రాబోతోంది ఏజెంట్ సినిమా..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: