ఆ యాడ్ కోసం విజయ్ దేవరకొండ ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!?

Anilkumar
సినీ ఇండస్ట్రీకి ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చి సక్సెస్ అవడం అంటే అంత తేలికైన పని కాదు.మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి చాలామందికి ఆదర్శం. ఆయనని ఆదర్శంగా తీసుకుని రవితేజ నాని వంటి హీరోలు ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోలుగా ఎదిగారు.వాళ్ళు స్థాయికి చేరుకోవడానికి చాలా సమయం పట్టింది.ఇక వీళ్ళ బాటిలోనే వచ్చిన విజయ్ దేవరకొండ మాత్రం కేవలం రెండు సినిమాలతో స్టార్ హీరో గుర్తింపును తెచ్చుకున్నాడు.ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో సపోర్టింగ్ రోల్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు విజయ్ దేవరకొండ. 

ఆ సినిమా తర్వాత పెళ్లిచూపులు అనే సినిమాలో హీరోగా నటించిన సినిమాతోనే సూపర్ హిట్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. విజయ్ దేవరకొండ కెరియర్  ఈ సినిమాతో మలుపు తిరిగింది. ఈ సినిమా తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ.ఈ సినిమాతో యూత్ లో ఆయనకి స్టార్ హీరో రేంజ్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.తరువాత గీత గోవిందం టాక్సీవాలా సినిమాల్లో నటించాడు విజయ్ దేవరకొండ. ఈ రెండు సినిమాలు సైతం ఊహించిన సక్సెస్ను అందుకున్న తరువాత ఆయన నటించిన మరో రెండు సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి.

అయితే ఒకవైపు సినిమాలతో పాటు మరోవైపు కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తూ భారీ మొత్తంలో సంపాదిస్తున్నాడు విజయ్ దేవరకొండ. అయితే ఒకప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోలు చేసిన థమ్స్ అప్ యాడ్ ఇప్పుడు విజయ్ దేవరకొండ చేస్తున్నాడు అయితే అప్పట్లో మహేష్ బాబు తో కాంట్రాక్ట్ ఉన్నప్పుడు థమ్స్ అప్ సంస్థ ఒక్కో యాడికి మహేష్ బాబుకి దాదాపుగా రెండు కోట్లకి పైగానే రెమ్యూనరేషన్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ కి ఒక్కో యాడ్ కోసం దాదాపుగా మూడు కోట్లకు పైగాని ఇస్తున్నట్లుగా సమాచారం. యూత్ లో విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ రేంజ్ లో ఉంది కాబట్టి మహేష్ బాబు కంటే విజయ్ దేవరకొండ ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. దీంతో ఒక్కో యాడ్ కి విజయ్ దేవరకొండ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకోవడంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: