అన్ని కోట్లు ఇచ్చి అఖిల్ ని రాజమౌళి చేతిలో పెట్టిన నాగార్జున..!?

Anilkumar
అక్కినేని కుటుంబం నుండి భారీ అంచనాల మధ్య సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన అక్కినేని అఖిల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదట అఖిల్ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు అఖిల్. అఖిల్ ది పవర్ ఆఫ్ జువా సినిమాతో స్టార్ హీరో రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ మరియు స్టార్ హీరో రేంజ్ గా ఎదిగాడు అఖిల్. ఇక ఈ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అయినప్పటికీ అక్కినేని కుటుంబం నుండి మూడవ తరంలో అఖిల్ ఒక స్టార్ హీరోగా మారబోతున్నాడు అని అందరూ అనుకున్నారు.కానీ సినీ ఇండస్ట్రీకి హీరోగా ఆయన వచ్చిన ముహూర్తం అస్సలు బాగాలేదు. 

అందుకే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 8 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు కెరియర్ లో చెప్పదగ్గ ఒక్క హిట్ సినిమా కూడా అఖిల్కి లేదు. తాజాగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఏజెంట్ సినిమా ఎంతలా డిజాస్టర్ గా మిగిలిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన నటిస్తున్న సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్ గా మిగలడంతో ఇప్పుడు అఖిల్ ఖాతాలో కచ్చితంగా ఒక హిట్ సినిమా పడాల్సిందే .అఖిల్ కి సూపర్ హిట్ సినిమా కావాలి అంటే కచ్చితంగా సూపర్ హిట్ ఇచ్చే ఒక మంచి దర్శకుడు కావాలి. అయితే ఎన్ని రోజులు నాగార్జున అఖిల్నీ తన ఇష్టానికి వదిలేసాడు.

కానీ ఇప్పుడు తన కొడుకు జీవితాన్ని తానే చేతిలోకి తీసుకొని తాజాగా దర్శక ధీరుడు రాజమౌళిని కలిసాడట నాగార్జున .అంతేకాదు అఖిల్ తో ఒక సినిమాని కూడా నాగార్జున సెట్ చేసినట్లుగా తెలుస్తోంది.ఇక ఇందుకోసం నాగార్జున రాజమౌళికి పది కోట్ల రూపాయలు అడ్వాన్స్ సైతం ఇచ్చినట్లుగా సమాచారం. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు .ఇందులో భాగంగానే స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి .ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే అఖిల్ రాజమౌళి కాంబినేషన్లో సినిమా రాబోతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఇక ఇదే గనుక నిజమైతే అక్కినేని అభిమానులకు పండగ అని చెప్పొచ్చు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: