కొడుకు విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న బాలయ్య..!?

Anilkumar
తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు నందమూరి బాలకృష్ణ. యంగ్ హీరోలకి ఏమాత్రం తీసుకుపోకుండా వాళ్లకంటే సరికొత్త కంటెంట్ తో మాస్ సినిమాలు చేస్తూ డబుల్ స్పీడ్ లో రిలీజ్ చేస్తున్నాడు బాలకృష్ణ .ఇటీవల విరసింహారెడ్డి సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య. త్వరలోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరొక సినిమా కూడా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ సైతం శరవేగంగా జరుగుతుంది. 

ఇదిలా ఉంటే ఇక నందమూరి బాలకృష్ణ రాబోయే తరానికి సంబంధించి మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడని ఎప్పటినుండో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో ఎంట్రీ ఇస్తాడు ఆ సినిమాతో ఎంట్రీ ఇస్తాడు అన్న వార్తలు తప్పించి ఇప్పటివరకు మోక్షజ్ఞ ఎంట్రీ పై ఇప్పటివరకు బాలయ్య క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మళ్లీ బాలకృష్ణ నందమూరి అభిమానులకు నిరాశ మిగిల్చాడు అన్న వార్తలు మళ్లీ వినబడుతున్నాయి. అయితే నిజానికి జూన్ 10న నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా మోక్షజ్ఞ ఎంట్రీని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తూ బోయపాటి దర్శకత్వంలో రాబోయే సినిమాలో అఫీషియల్ గా అప్డేట్ ఇచ్చి

 నందమూరి అభిమానులను ఖుషి చేయాలని అనుకున్నారట. కానీ తాజాగా అందుతున్న సమాచారం మేరకు మోక్షజ్ఞ జాతకం అసలు బాగాలేదని ఈ సంవత్సరం ఇది జరగని పని అని వచ్చే సంవత్సరంలో తన సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అని బాలయ్య నమ్మిన జ్యోతిష్కుడు చెప్పడంతో బాలయ్య కూడా సరే అని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ బోయపాటి సినిమాలో మోక్షజ్ఞని అఫీషియల్ గా పరిచయం చేద్దామని అనుకున్నా ఆశలు నిరాశగా మేలిపోయాయట. దీంతో ఈ వార్త విన్న నందమూరి అభిమానులు బాధపడుతున్నారు. దీంతో బాలకృష్ణ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: