'కార్తికేయ' లాంటి బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?

Anilkumar
ప్రస్తుతం ఉన్న యంగ్ జనరేషన్ హీరోల్లో విభిన్న తరహా సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ తో ముందుకు వెళ్తున్నాడు నిఖిల్. ఈ యంగ్ హీరో స్క్రిప్ట్ సెలక్షన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అందరూ హీరోలు చేసేట్టు కమర్షియల్, రొటీన్ లవ్ స్టోరీస్ కాకుండా మంచి కంటెంట్ ఉండే స్క్రిప్ట్లను సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అలా నిఖిల్ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీ గా నిలిచింది 'కార్తికేయ'. థ్రిల్లర్ అండ్ మిస్టరీ జోనర్ లో వచ్చిన ఈ మూవీ సెన్సేషనల్ హిట్ ని అందుకుంది. కేవలం 6 కోట్ల బడ్జెట్ తో తెరికెక్కిన ఈ సినిమా సుమారు 20 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకొని బ్లాక్ బస్టర్ విజయాన్ని కైవసం చేసుకుంది. 

చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిఖిల్ సరసన స్వాతి హీరోయిన్ గా నటించింది. అయితే ముందుగా ఈ సినిమా స్టోరీని డైరెక్టర్ చందు మొండేటి హీరో అల్లరి నరేష్ కు చెప్పాడట. కథ కూడా అల్లరి నరేష్ కి విపరీతంగా నచ్చేసిందట. అయితే కథలో పాములతో ఉండే సన్నివేశాలు చాలా కీలకం. కానీ అల్లరి నరేష్ కి పాములు అంటే చాలా భయం. అందుకే ఈ సినిమాని అల్లరి నరేష్ రిజెక్ట్ చేశాడట. ఈ విషయాన్ని ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. తనకు బయట పాము కనిపిస్తే ఆమడ దూరంలో పారిపోతారని, అలాగే సినిమాలో పాములు ఉన్న సీన్స్ వచ్చినా భయపడతానని నరేష్ ఇంటర్వ్యూలో చెప్పాడు.

అలా నరేష్ రిజెక్ట్ చేయడంతో చందు ముండేటి నిఖిల్తో కార్తికేయ సినిమాని తీశాడు. 2014 అక్టోబర్ 14న విడుదలైన ఈ సినిమా నిఖిల్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక గత ఏడాదే ఈ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన 'కార్తికేయ 2' పాన్ ఇండియా హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుని నిఖిల్ ని పాన్ ఇండియా హీరోని చేసింది. అన్నట్టు కార్తికేయ సినిమాకి ఇప్పుడు పార్ట్-3 కూడా ఉండబోతోంది.ఇదే విషయాన్ని దర్శకుడు పార్ట్ 2 లోనే హింట్ ఇవ్వడం జరిగింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: