'కస్టడీ' సినిమాలో అరవింద్ స్వామి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?

Anilkumar
అక్కినేని హీరో నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ 'కస్టడీ' మే 12 న ప్రపంచవ్యాప్తంగా తమిళ, తెలుగు భాషల్లో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చైతు సరసన కృతి శెట్టి హీరోయిన్గా నటించగా.. ప్రముఖ తమిళ నటుడు అరవింద్ స్వామి విలన్ గా కనిపించారు. మంచి అంచనాలతో థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ అందుకోలేకపోయింది. ఈ మూవీ బిజినెస్ సుమారు 22 కోట్ల వరకు జరిగింది.కానీ ఫుల్ రన్ లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవడం కాస్త కష్టంగానే కనిపిస్తోంది. 

అయితే సినిమాలో చైతు యాక్టింగ్ తో పాటు అరవింద్ స్వామి విలనిజం కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.నిజానికి సినిమాలో చైతు క్యారెక్టర్ కంటే అరవింద్ స్వామి క్యారెక్టర్ కే మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాలో అరవింద్ స్వామి క్యారెక్టర్ కోసం ముందుగా తమిళ హీరో మాధవన్ ని అనుకున్నారట. మాధవన్ కి కూడా కథ నచ్చింది. కానీ ఆ సమయంలో డేట్స్ సర్దుబాటు రాకపోవడంతో కష్టడి మూవీ లో అరవింద్ స్వామి పాత్రను వదులుకున్నాడు. నిజానికి గతంలో మాధవన్ నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమాలో విలన్ గా నటించాడు.కానీ ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయింది.

ఆ తర్వాత తాజాగా కస్టడీ మూవీలో ఛాన్స్ వచ్చినా కూడా డేట్స్ అడ్జస్ట్ చేయలేక మిస్ చేసుకున్నాడు. ఇక మానాడు వంటి సూపర్ తర్వాత వెంకట్ ప్రభు నుంచి కష్టడి లాంటి మూవీని ఫాన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు. థాంక్యూ వంటి భారీ ప్లాప్ తర్వాత చైతు ఆశలన్నీ కస్టడీ సినిమాపైనే ఉండగా.. ఈ సినిమా కూడా చైతుకి సక్సెస్ ని అందించలేకపోయింది. ఇప్పటికైనా నాగచైతన్య కంటెంట్ ఉన్న స్టోరీస్ ని సెలెక్ట్ చేసుకుని మంచి సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: