రష్మిక పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఐశ్వర్య రాజేష్...!!

murali krishna
ఐశ్వర్యా రాజేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ సినిమా ఫర్హానా. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌.ఆర్‌.ప్రకాష్, ఎస్‌.ఆర్‌.ప్రభు ఈ చిత్రాన్ని నిర్మించారట.
డైరెక్టర్ నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించిన ఈ మే12న తెలుగుతోపాటు.. తమిళం, హిందీ, తెలుగు భాషల్లో విడుదల అయ్యింది. అయితే ఈ ప్రమోషనల్లో భాగంగా ఐశ్వర్య రాజేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. పుష్ప చిత్రంలో రష్మిక పోషించిన శ్రీవల్లి పాత్రకు తనకు కనుక వచ్చి ఉంటే.. నటించేదాన్ని అని.. ఆ రోల్ తనకు బాగా సరిపోతుందని కూడా అన్నారు. అలాగే తనకు తెలుగు ఇండస్ట్రీ అంటే ఎంతో ఇష్టమని.. ఎన్నో సంవత్సరాలు ఎదురుచూసిన తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో ఛాన్స్ అయితే వచ్చిందని చెప్పుకొచ్చింది.
'వరల్డ్ ఫేమస్ లవర్ నన్ను తెలుగువారికి దగ్గర చేసింది. ఆ తర్వాత టక్ జగదీశ్ మరియు రిపబ్లిక్ లు చేశాను. తెలుగులో నాకు ఆఫర్స్ రావట్లేదని కాదు.. వస్తున్నాయి.. కాకపోతే మంచి పాత్రలతో మళ్లీ కమ్ బ్యాక్ ఇవ్వాలని అయితే ఉంది. ప్రస్తుతానికి తెలుగులో ఏ ప్రాజెక్ట్ కూడా చేయడం లేదు. ఒకవేళ నాకు పుష్పలో అవకాశం వచ్చి ఉంటే.. తప్పకుండా చేసేదాన్ని. రష్మిక కూడా బాగా నటించారు. కాకపోతే ఆ రోల్ నాకు అయితే బాగా సెట్ అవుతుందని నా నమ్మకం. అలాగే నాకు డ్రీమ్ రోల్ అంటూ ఏదీ కూడా లేదు. ప్రేక్షకులను అలరించే విధంగా మంచి పాత్రలు చేయాలని అయితే ఉంది. పాత్ర ఏదైనా  కానీ దుమ్ము దులిపేయడమే ' అంటూ చెప్పుకొచ్చిందట.ఐశ్వర్య రాజేష్.
' చిన్నదైనా.. లేదా పెద్దదైనా.. తెలుగు ప్రేక్షకులు దాన్ని ఆదరించే తీరు మాత్రం ప్రత్యేకంగా ఉంటుందని.. బాగుందని చెబితే కనుక వాళ్లే దాన్ని బ్లాక్ బస్టర్ చేస్తారు. ఇలాంటి ప్రేమను ఏ పరిశ్రమలో కూడా నేను చూడలేదు. నేను నటించి డ్రైవర్ జమున ను ఆహాలో విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: