చేతులారా కెరీర్ నాశనం చేసుకుంటున్న సమంత..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం స్టార్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తోంది.నాగచైతన్య కి విడాకులు ఇచ్చిన అనంతరం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది సమంత. ఇక సమంత కాల్ షీట్స్ దొరికితే సినీ ఇండస్ట్రీలో పండగ చేసుకునే వారు ఎంతోమంది ఉన్నారు. కానీ సమంత అడుగులు ఆలోచనలు మాత్రం సరిగ్గా లేవు అని భావిస్తున్నారు జనాలు.స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న సమంత క్రేజ్ ఇంత కింతకి తగ్గిపోతుంది. అయితే ఇందుకు కారణం స్వయంగా సమంతానే అని తెలుస్తుంది. ఎందుకు అంటే సమంత స్టార్ హీరోల సినిమాల్లో వాళ్ళకి జోడిగా నటించడం మానేసింది. 

అంతేకాదు తానే లీడ్రోల్ అంటే ఫిమేల్ ఓరియంట్ సినిమాలో చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంది. అయితే ఇదే సమంత చేస్తున్న తప్పు అని అంటున్నారు. సాధారణంగా ఏ ఇండస్ట్రీలో నైనా స్టార్ హీరోలకు జోడిగా వచ్చే క్రెజ్ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తే అసలు రావు. కమర్షియల్టీ పరంగా కూడా ఆ సినిమాలకు పెద్దగా గ్రేస్ ఉండదు. ఇటీవల సమంత యశోద సినిమాలో నటించింది.ఈ సినిమా మంచి టాక్ ను తెచ్చుకున్నప్పటికీ లాభాలు మాత్రం తెచ్చుకోలేకపోయింది. అనంతరం సమంత తాజాగా నటించిన శకుంతల సినిమా సైతం భారీ ఫ్లాప్ సినిమాగా నిలిచింది.

లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ పోతున్న సమంత క్రేజ్ మార్కెట్ స్వయంగా తానే తగ్గించుకుంటుంది. గతంలో విజయశాంతి స్టార్ హీరోయిన్గా ఉన్నప్పుడు ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. కానీ ఆమె అటు స్టార్ హీరోలకు జోడిగా నటిస్తూనే ఇటు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసేది. కానీ విజయశాంతి ఒకేసారిగా లేడీ ఓరియంటెడ్ సినిమాల వైపు రాలేదు. కానీ సమంత మాత్రం ఎప్పుడూ కేవలం లేడీ ఓరియంటెడ్ సినిమాలో మాత్రమే చేస్తుంది. తాజాగా ఇప్పుడు ఈమె విజయ్ దేవరకొండ తో ఖుషి సినిమాలో నటిస్తోంది.  దీంతో స్టార్ హీరోలో సినిమాల్లో సమంత చాన్స్ లు వదులుకోవడం మంచిది కాదని అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: