సాయి పల్లవి రిజెక్ట్ చేసిన మహేష్ బాబు సూపర్ హిట్ మూవీ ఏంటో తెలుసా..?

Anilkumar
నాచురల్ బ్యూటీ సాయి పల్లవికి టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల్లో అసలు మేకప్ లేకుండా నటించిన ఏకైక హీరోయిన్ ఈమె. అందానికి ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం నటనకి ప్రాధాన్యత ఇస్తూ సాయి పల్లవి నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి. ఎంత పెద్ద హీరో సినిమాలో ఆఫర్ వచ్చినా సరే ఆ సినిమాలో తనకు క్యారెక్టర్ నచ్చితేనే నటిస్తుంది. లేకపోతే రిజెక్ట్ చేస్తుంది. అలా ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరో సినిమాలను రిజెక్ట్ చేసింది సాయి పల్లవి. ఆ స్టార్ హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఉన్నాడు. 

సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించే అవకాశం వస్తే సాయి పల్లవి దాన్ని సున్నితంగా తిరస్కరించిందట. అసలు మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ ఆఫర్ వస్తే ఎవరైనా వదులుకుంటారా. కానీ సాయి పల్లవి ఆ ఆఫర్ ని వదిలేసుకుంది. మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. 2020 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ని అందుకుంది. ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన హీరోయిన్గా నటించింది. అయితే నిజానికి ఇందులో రష్మిక కంటే ముందు సాయి పల్లవిని హీరోయిన్గా తీసుకోవాలని అనుకున్నారట డైరెక్టర్ అనిల్ రావిపూడి.

కానీ సాయి పల్లవికి ఈ సినిమాలో తన పాత్ర నచ్చకపోవడంతో ఆమె రిజెక్ట్ చేసిందట. దాంతో చేసేదేం లేక సాయి పల్లవి ప్లేస్ లో రష్మిక మందనను సెలెక్ట్ చేశారట. అలా పాత్ర నచ్చకపోవడం వల్ల సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ ని మిస్ సాయి పల్లవి. ఇక గత కొద్దికాలంగా ఎలాంటి సినిమాలు చేయకుండా సైలెంట్ గా ఉన్న సాయి పల్లవి ఈమధ్యనే కోలీవుడ్ అగ్ర హీరో శివ కార్తికేయన్ తో ఓ సినిమాని ఓకే చేసింది. ఇటీవల పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైన ఈ మూవీ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతోంది. విశ్వనటుడు కమలహాసన్ సోనీ పిక్చర్స్ సంస్థతో కలిసి ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. రాజ్ కుమార్ పెరియసామి ఈ మూవీ ని డైరెక్ట్ చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: