ఆ డైరెక్టర్ తో లవ్ స్టోరీకి ఓకే చెప్పిన ప్రభాస్..?

Anilkumar
టాలీవుడ్ అగ్ర హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం డార్లింగ్ చేతిలో అరడజనుకుపైగా సినిమాలు ఉన్నాయి. వాటిలో ఆదిపురుష్ విడుదలకు రెడీ గా ఉంది. జూన్ 16న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇక ప్రస్తుతం ప్రాజెక్ట్ కే, సలార్, మారుతి మూవీ షూటింగ్ దశలో ఉన్నాయి. వీటితోపాటు సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా ఇంకా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందనే విషయంలో క్లారిటీ రాలేదు.

ఇదిలా ఉంటె తాజాగా ప్రభాస్ మరో డైరెక్టర్ ని లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది. లేటెస్ట్ ఫిలింనగర్ రిపోర్ట్స్ ప్రకారం సీతారామం సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి తో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నారట. ఇటీవల హను రాఘవపూడి ప్రభాస్ కి ఓ కథ వినిపించారని, ఆ కథ డార్లింగ్ కి బాగా నచ్చడం,అలాగే తనతో తో దర్శకుడు మాట్లాడే తీరు ప్రభాస్ ని బాగా ఆకట్టుకుందట. ఈ క్రమంలోనే ఇప్పుడు హనురాఘవపూడితో సినిమా చేసేందుకు డార్లింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ప్రభాస్ కోసం హను రాఘవపూడి లవ్ స్టోరీ కం రొమాంటిక్ డ్రామాని ప్రిపేర్ చేసినట్టు తెలుస్తోంది.

అంతేకాదు ఈ ప్రాజెక్ట్ ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ తో కలిసి సీనియర్ నిర్మాత అశ్విని దత్ నిర్మించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈమధ్య ప్రభాస్ ఎక్కువగా యాక్షన్ మూవీస్ లో కనిపిస్తుండడంతో ఇప్పుడు ఓ ఫ్రెష్ లవ్ స్టోరీ చేయాలనుకున్నారట. ఈ క్రమంలోనే ప్రభాస్ కి హాను రాఘవపూడి కథ చెప్పడం, అది ఆయనకు నచ్చడంతో ఈ ప్రాజెక్టు ఓకే అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ న్యూస్ తో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అంతేకాదు సీతారామం లాంటి అద్భుతమైన ప్రేమ కథను తెరకెక్కించిన హను రాఘవపూడి - ప్రభాస్ కాంబో మూవీ కోసం ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఇక త్వరలోనే ఈ ప్రాజెక్టుపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: