మూడవ భార్య పై రివేంజ్ తీర్చుకోడానికి 15 కోట్లు ఖర్చు చేసి అలాంటి పని చేసిన నరేష్..!?

Anilkumar
టాలీవుడ్ సినీ పరిశ్రమలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పట్లో కామెడీ హీరోగా రాజేంద్రప్రసాద్ తో సమానమైన ఇమేజ్ ని సంపాదించుకున్నాడు నరేష్. హీరోగా కెరియర్ ముగిసిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇంకా ఎక్కువ గుర్తింపును సంపాదించుకున్నాడు. ఎలాంటి పాత్ర అయినా అలవోకగా చేసే టాలెంట్ కలిగిన వాడు నరేష్. నటుడిగా ఎంత ఎత్తుకు ఎదిగిన వ్యక్తిగతంగా మాత్రం నరేష్ చేసే కొన్ని పనుల వల్ల నిరంతరం సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటాడు నరేష్.ఈయన పైత్యం చూస్తే నరేష్ కి మతిస్థిమితం సరిగా లేదా అని అనిపిస్తుంది.

ఇటీవల ఆయన పవిత్ర లోకేష్ ని నాలుగవ పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ పెళ్లి కారణంగా నరేష్ ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటాడు. ఇదిలా ఉంటే ఇక నరేష్ ఏకంగా తన నాలుగవ పెళ్లికి సంబంధించి ఒక సినిమానే తీశాడు. ఇక ఆ సినిమా పేరు మళ్లీ పెళ్లి. ఇక ఈ సినిమాలో నరేష్ మరియు పవిత్ర లోకేష్ హీరో హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం. ఇక ఈ సందర్భంగా నరేష్ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఆ సమావేశంలో ఒక యాంకర్ ఈ సినిమాని మీరు మీ మూడవ భార్య రమ్య రఘుపతి మీద రివెంజ్ తీసుకోవడానికి చేశారా అని అడిగాడు.

దానికి ఊహించని సమాధానం చెప్పాడు నరేష్. రమ్య మీద పగ తీర్చుకోవడానికి నేను 15 కోట్లు పెట్టి సినిమా తీయాలా.. యూట్యూబ్లో డబ్బులు ఇస్తే క్లోజ్ చేసేవారు చాలామంది ఉన్నారు.. ఇది ఎవరిని ఉద్దేశించి తీసిన సినిమా కాదు.. ఎవరికైనా సరే ఒక వయసు వచ్చిన తర్వాత తోడు కావాలని అనిపిస్తుంది ..అందులో ఎటువంటి తప్పులేదు.. అలా రెండు మనసులు ఎలా కలిశాయి అనే దానిమీద మేము ఈ సినిమాని చేశాము.. దీని ద్వారా ఆ విషయాన్ని తెలియజేయాలని అనుకున్నాము.. అంటూ చెప్పాడు నరేష్ .కానీ ఆయన పైకి అలా చెప్పిన కూడా ఈ సినిమా కేవలం తను మూడవ భార్యని టార్గెట్ చేసి తీశాడు అని ఈ సినిమా ట్రైలర్ చూస్తే అందరికీ అర్థమవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: