రానా నాయుడు వెబ్ సిరీస్ పై సంచలన కామెంట్స్ చేసిన నాగచైతన్య..!?

Anilkumar
దగ్గుబాటి హీరో వెంకటేష్,రానా ప్రధాన పాత్రలో నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ ఓ టి టి ప్లాట్ఫామ్ నెట్ ఫిక్స్ లో మార్చి 10న స్ట్రీమింగ్ అయింది. లేకపోతే ఈ వెబ్ సిరీస్ పై ఏ రేంజ్ లో విమర్శలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న వెంకటేష్ ఇలాంటి వెబ్ సిరీస్ చేయడం పై ఆయన అభిమానులు తీవ్రంగా అభ్యంతరం వ్యర్థం చేశారు. అయితే ఈ వెబ్ సిరీస్ లో బూతులు తీవ్రస్థాయిలో ఉన్నాయని సిరీస్ నిండా సభ్యతమైన సీన్లో ఉన్నాయి అంటూ చాలా దారుణంగా ఈ సిరీస్ పై మండిపడుతున్నారు నేటిజన్స్. 

బోల్ట్ కంటెంట్ తో వచ్చిన ఈ సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ లో రికార్డులు భద్ర కొట్టింది. భారీ వ్యూస్ ను సొంతం చేసుకుంది ఈ సిరీస్. అంతేకాదు ఈ సిరీస్ రిలీజ్ కి ముందే కుటుంబంతో కలిసి చూసేది కాదు అని క్లారిటీ ఇచ్చారు. చిత్ర బృందం అయితే తాజాగా రానా నాయుడు వెబ్సైట్ మరియు ఆ సిరీస్ లో నటించిన వెంకటేష్ మరియు రాణాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో అక్కినేని నాగచైతన్య స్పందించాడు. తాజాగా ఆయన హీరోగా నటించిన కష్టడి సినిమా ఇవాళ విడుదల అయింది. ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు చైతన్య.

ఈ క్రమంలోనే రాననాయుడు సిరీస్ పై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలను చేశాడు. వెంకటేష్ గారికి తెలుగు రాష్ట్రాల్లో నే మొదటి నుండి ఫ్యామిలీ హీరోగా మంచి క్రేజ్ ఉంది. అయితే ఈ సిరీస్ చూసి ప్రేక్షకులు షాక్ అయి ఉండొచ్చు. కానీ నటుడు అన్నప్పుడు అన్ని రకాల పాత్రల్లో నటించాలి. అప్పుడే వారికి ఎదుగుదల ఉంటుంది. నటుడిగా కొత్తగా ట్రై చేశాడు అంతే.చేసినంత మాత్రాన ఆయన ఇంట్లో కూడా అలానే ఉంటాడు అని కాదు. అంటూ చెప్పాడు నాగ చైతన్య. అదిలా ఉంటే ఇక నాగచైతన్య హీరోగా నటించిన కష్టడి సినిమాలో కృతి శెట్టి హీరోయిన్గా నటించింది. వెంకట్ ప్రభువు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అరవింద్ స్వామి, శరత్ కుమార్ ,రేవతి మరికొందరు కొన్ని కీలక పాత్రలో నటించారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: