'ఆదిపురుష్' సినిమాని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?

Anilkumar
పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ 'ఆదిపురుష్' జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్యే మూవీ యూనిట్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశారు. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఆదిపురుష్ ట్రైలర్ ని విడుదల చేయగా.. ఈ ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే విజువల్స్ పరంగా ఆకట్టుకున్నా.. ట్రైలర్లో ప్రభాస్ లుక్స్, డైలాగ్ డెలివరీ అంతగా బాలేదని ట్రైలర్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా ఎక్కువ అయిపోయాయి. రాముడికి ఎక్కడైనా మీసాలు ఉంటాయా? సినిమాలో ప్రభాస్ తన లుక్స్ విషయంలో చాలా నిర్లక్ష్యం చేశాడని, డైలాగ్స్ కూడా చాలా బద్ధకంగా చెబుతున్నాడని.. 

సినిమాకి అవే మైనస్ అవుతాయంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.అయితే రెండు నిమిషాల ట్రైలన్ని చూసి సినిమా రిజల్ట్ డిసైడ్ చేయడం ఏమాత్రం సరికాదని ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోలర్స్ కి గట్టి సమాధానం ఇస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ లేటెస్ట్ అప్డేట్ బయటికి వచ్చింది. ఆదిపురుష్ సినిమాని ముందుగా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్తో తీయాలని అనుకున్నాడట దర్శకుడు ఓం రౌత్. శ్రీరాముడిగా హృతిక్ రోషన్ ని.. రావణాసురుడు పాత్రలో ప్రభాస్ ని పెట్టాలనుకున్నాడట. కానీ రుతిక్ రోషన్ కథలో కొన్ని కీలక మార్పులు చేయాలని సూచించడం అది కాస్తా దర్శకుడికి నచ్చకపోవడంతో ఈ ప్రాజెక్టు  సెట్స్ మీదకి వెళ్లలేదు.

ఆ తర్వాత ఇదే కథతో కొన్ని రోజుల తర్వాత ప్రభాస్ దగ్గరికి వెళ్లడంతో ప్రభాస్ ఓకే చేశాడు. దీంతో శ్రీరాముడిగా ప్రభాస్.. రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ ని పెట్టి ఆది పురుష చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు ఓంరౌత్. ఇక ఈ సినిమాని మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కించారు మేకర్స్. 2Dతోపాటు 3D లో కూడా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో మనకు కనిపించిన వానరసైన్యం మొత్తం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ద్వారా క్రియేట్ చేయబడిందే ట్రైలర్ లో ఆ విజువల్స్ కూడా చూస్తున్నంత సేపు ఆడియన్స్ కి ఎంతో మంచి అనుభూతి కలిగించాయి. మరి రేపు థియేటర్లో విడుదలయ్యాక ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని  అందుకుంటుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: