ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లలో విడుదల కనుల "కస్టడీ" మూవీ..!
ఈ సినిమా నైజాం ఏరియాలో 195 థియేటర్ లలో విడుదల కానుండగా ... సీడెడ్ ఏరియాలో 100 థియేటర్ లలోనూ ... ఆంధ్ర ఏరియాలో 250 ప్లస్ థియేటర్ లలోనూ విడుదల కానుంది. మొత్తంగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 545 థియేటర్ లలో విడుదల కానుంది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ సినిమా 150 ప్లస్ థియేటర్ లలోనూ , ఓవర్ సీస్ లో ఈ మూవీ 180 థియేటర్ లలోనూ విడుదల కానుంది. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 875 ప్లస్ థియేటర్ లలో విడుదల కానుంది.
ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 22.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 25 కోట్ల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా సాధించినట్లు అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది.