దర్శకుడి కథనం కంటే అవుట్ పుట్ అదిరిపోయే రేంజ్ లో వచ్చింది... ఏజెంట్ నిర్మాత..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నిర్మాత లలో ఒకరు అయినటువంటి అనిల్ సుంకర గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నిర్మాత ఇప్పటికే ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఎన్నో సినిమాలను నిర్మించాడు. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించగా ... కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను అందుకున్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ దర్శకుడు అక్కినేని అఖిల్ హీరోగా సాక్షి వైద్య హీరోయిన్ గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఏజెంట్ అనే మూవీ కి నిర్మాత గా వ్యవహరించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ప్రస్తుతం ఈ నిర్మాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ అనే సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ తో పాటు ఈ నిర్మాత "ఊరు పేరు భైరవకోన" అనే సినిమాను కూడా నిర్మించాడు.

ఈ మూవీ ని మరి కొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ గురించి అనిల్ సుంకర మాట్లాడుతూ ... ఒక చిత్రం యొక్క ఔట్ పుట్ దర్శకుడు ఇచ్చిన ఫైనల్ కథనంలో 70% సరిపోతే మేము దానిని హిట్ మూవీ గా పేర్కొంటాము. కానీ ఊరు పేరు భైరవకోన ఫిలిం యొక్క ఔట్ పుట్ దర్శకుడు కథనం కంటే 50 శాతం ఎక్కువ అని అనిల్ సుంకర చెప్పుకొచ్చాడు. ఊరు పేరు భైరవ కోన సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటించగా వి ఐ ఆనంద్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: