మొత్తానికి నాగచైతన్య పై తనకున్న ప్రేమను బయటపెట్టిన కృతి శెట్టి..!?

Anilkumar
ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయిన కృతి శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఉప్పెన బంగారు రాజు శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకొని స్టార్ హీరోయిన్ లిస్టులోకి చేరింది కృతి శెట్టి.దాని అనంతరం ఆమె హీరోయిన్ గా నటించిన మాచర్ల నియోజకవర్గం ,ది వారియర్,ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఇటువంటి సినిమాలో నటించినప్పటికీ ఆ సినిమాలు అన్నీ కూడా డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో కృతి శెట్టి రేంజ్ ఒక్కసారిగా పడిపోయింది. ఈ నేపథ్యం లొనే ప్రస్తుతం కృతి శెట్టి అక్కినేని నాగచైతన్యతో కలిసి కస్తూరి సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.

 ఈ సినిమాతో నాగచైతన్య మొదటిసారిగా తమిళ్ లో కూడా పరిచయం కాబోతున్నారు ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదలై మంచి రెస్పాన్స్ ను అందుకుంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జరిపారు చిత్రబంధం. ఇక ఆ ఈవెంట్ లో భాగంగా కృతి శెట్టి స్టేజ్ పై స్పీచ్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆమె మాట్లాడుతూ నాగచైతన్య మీద తనకి ఉన్న ప్రేమను బయటపెట్టింది. కృతి శెట్టి. ఆమె మాట్లాడుతూ ఈవెంట్ కి చాలామంది ఎక్కడెక్కడినుండో వచ్చారు వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్.

ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే దానికి కారణం మీ ఆదరాభిమానాలు అంటూ చెప్పుకోచింది. ఇక నాగచైతన్య ఎప్పటికి నా బంగారు రాజే. ప్రస్తుతం ఈ సినిమాలో ఆయన శివ క్యారెక్టర్ లో చేస్తున్నారు. ఆ క్యారెక్టర్ చూసి మీరు ఇట్టే ప్రేమలో పడిపోతారు. నా జీవితంలో ఇన్స్పిరేషన్ గా ఉన్న వ్యక్తుల్లో నాగచైతన్య కూడా ఒకరు .అంటూ నాగచైతన్య పై తనకున్న ప్రేమను బయటపెట్టింది క్రితిశెట్టి. దీంతో కృతి శెట్టి నాగచైతన్య పై తనకి ఉన్న ప్రేమను బయట పెట్టడంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చేక్కర్లు కొడుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: