వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్న బుల్లితెర కమెడియన్..!!

Anilkumar
బుల్లితెర కమెడియన్ మహేష్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షోలో తన కామెడీతో కడుపుబ్బ నవ్వించిన ఇతను ఒక్కసారిగా సుకుమార్, రామ్ చరణ్ కలయిక లో వచ్చిన 'రంగస్థలం' సినిమాతో నటుడిగా మారి మంచి నటన కనబరిచాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ కి ఎప్పుడు వెన్నంటే ఉండే పాత్రలో అదరగొట్టాడు మహేష్. ఇక ఈ సినిమాతో నటుడిగా మారిన మహేష్ అక్కడితో బుల్లితెరను వదిలి కేవలం సినిమాలకే పరిమితం అయిపోయాడు. అలా ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ పై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సత్తా చాటుతున్నాడు. ఎమోషనల్ సీన్స్ లోనూ ఏడిపించి, తనలో విలనిజాన్ని సైతం చూపించాడు. 

అలా విభిన్న పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మహేష్ కు రంగస్థలం మూవీ కెరియర్ని మార్చేసింది. ఆ సినిమాతోనే తన ఇంటిపేరు రంగస్థలం మహేష్ గా మారిపోయింది. ఇక ప్రస్తుతం మహేష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు మహేష్. ఏకంగా అగ్ర హీరోలతో పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు. ఇటీవల దాస్ కా ధమ్కీ కి సినిమాలో తన కామెడీతో ప్రేక్షకులను అలరించిన మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ - మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న చిత్రంలో నటిస్తున్నాడు. దాంతోపాటు ప్రభాస్ - మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలోనూ మహేష్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

దాంతోపాటు కళ్యాణ్ రామ్ నటింనటిస్తున్న 'డెవిల్' సినిమాలోనూ నటిస్తున్నాడు. అలా ప్రస్తుతం భారీ పాన్ ఇండియా సినిమాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు రంగస్థలం మహేష్. మొన్నటి వరకు కమెడియన్గా, ఆర్టిస్ట్ గా చిన్న చిన్న సినిమాల్లో కనిపించిన మహేష్.. ఇప్పుడు ఏకంగా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇక ఈ సినిమాల్లో కనుక రంగస్థలం మహేష్ తన నటనతో మెప్పిస్తే.. మున్ముందు టాలీవుడ్ లోనే ఇతని పేరు మారుమ్రోగడం ఖాయం అని చెప్పవచ్చు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: