ఆదిపురుష్: ఓం రౌత్ కి ఇదే లాస్ట్ ఛాన్స్.. లేదంటే కష్టమే?

Purushottham Vinay
ఇక ఈ 2023 వ సంవత్సరంలో ప్రపంచం అంతా కూడా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆదిపురుష్.ఇప్పటికే భారీ అంచనాలు సంపాదించుకున్న ఆదిపురుష్‌ సినిమా ట్రైలర్ లాంచ్ కు రెడీ అయింది.మే 9 వ తేదీన గ్లోబల్ ట్రైలర్ లాంచ్‌తో చరిత్ర సృష్టించడానికి రెడీగా ఉంది. ఇంకా ఈ మెగా ట్రైలర్ లాంచ్‌ను ప్రకటిస్తూ.. ఆదిపురుష్‌ సినిమా నుంచి పాన్-ఇండియా స్టార్, ప్రభాస్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ మాగ్నమ్ ఓపస్ ఇప్పటికే న్యూయార్క్‌లోని ట్రిబెకా ఫెస్టివల్‌లో అంతర్జాతీయ ప్రీమియర్‌కు సెలెక్ట్ అవ్వడం ద్వారా ఓ సూపర్ మైల్ స్టోన్ ను సాధించింది. ఇప్పటికే విడుదలైన  గ్లింప్స్ టీజర్ తో ప్రేక్షకులలో భారీ అంచనాలు పెంచింది. ఇక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల కోసం అద్భుతమైన ట్రైలర్ తో ఈ సినిమా రెడీ అయ్యింది. మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలలో ఈ ట్రైలర్ ను రికార్డ్ స్థాయిలో లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం తెలుస్తుంది.


అందుకే ఇది ఇప్పుడు వరల్డ్ ఈవెంట్ గా మారింది.ఇండియాతో పాటు సింగపూర్, ఇండోనేషియా, థాయ్‌లాండ్, మలేషియా, హాంకాంగ్, ఫిలిప్పీన్స్, మయన్మార్, శ్రీలంక ఇంకా జపాన్‌తో సహా యూఎస్ఏ, కెనడా, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆసియా & దక్షిణాసియాలోని భూభాగాల్లో ఆఫ్రికా, యూకే అండ్ యూరప్, రష్యా ఇంకా ఈజిప్ట్ దేశాల్లో ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ అనేది జరగబోతోంది. ఈ గొప్ప భారత ఇతిహాస కథ ప్రపంచ ప్రేక్షకులను ఓ సాహసోసేతమైన యాక్షన్ ప్రపంచంలోకి తీసుకువెళ్లడం ఖాయం అట.ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే, వత్సల్ సేన్, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆదిపురుష్‌ సినిమా జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.ఇది వరకు టీజర్ ట్రోల్స్ తో బాధ పడ్డ ఓం రౌత్ కి ఇదే లాస్ట్ అండ్ బెస్ట్ ఛాన్స్.. ఈ ఛాన్స్ కూడా మిస్ అయితే ఆది పురుష్ హిట్ అవ్వడం కష్టమే. చూడాలి ఈసారి ఓం మ్యాజిక్ ఎలా ఉంటుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: