వెబ్ సిరీస్ ల కోసం ఎంత చూపించడానికైనా రెడీ అంటున్న భూమిక..?

Anilkumar
టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన భూమిక చావ్లా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి స్టార్స్ తో నటించి భారీ క్రేజ్ అందుకున్న ఈ భామ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇక తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా అగ్ర హీరోల సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తోంది భూమిక. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భూమిక..తనకు సినిమాల కంటే వెబ్ సిరీస్ లలో నటించాలని ఉందంటూ చెప్పుకొచ్చింది. 

అంతేకాదు వెబ్ సిరీస్ ల కోసం కాస్త బోల్డ్ సీన్స్ లో నటించడానికి కూడా రెడీ అన్నట్లుగా చెప్పింది. వెబ్ సిరీస్ లో అయితే నటనా ప్రతిభ చూపించేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుందని, అందుకే తాను వెబ్ సిరీస్ లలో నటించేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నానంటూ చెప్పుకొచ్చింది భూమిక. యాక్టింగ్ కి స్కోప్ ఉండే పాత్రలు చేయాలని తనకు ఉందని, అలా చేయాలంటే సినిమాల కంటే వెబ్ సిరీస్ బెస్ట్ ఆప్షన్ అంటూ చెప్పింది. అందుకే వెబ్ సిరీస్ లో తనకు నటించాలని ఉందని, అవసరమైతే బోల్డ్ సన్నివేశాల్లో కూడా నటించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పింది. దీంతో భూమిక చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మరి భూమిక ను వెబ్ సిరీస్ ల కోసం మేకర్స్ సెలెక్ట్ చేసుకుంటారేమో చూడాలి.ఇక ఆడియన్స్ కూడా ఈ మధ్యకాలంలో సినిమాల కంటే వెబ్ సిరీస్ పైన ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.  కాబట్టి ప్రేక్షకుల అభివృద్ధికి తగ్గట్టు కొంతమంది సెలబ్రిటీలు సినిమాల కంటే వెబ్ సిరీస్లలో నటించాలని అనుకుంటున్నారు. ఆ లిస్టులో ఇప్పుడు భూమిక చావ్లా కూడా చేరింది. ఇక అటు అభిమానులు సైతం భూమిక యాక్టింగ్ కి ఎక్కువ స్కోప్ ఉన్న వెబ్ సిరీస్ లో నటించాలని కోరుకుంటున్నారు. ఇక ఇటీవల బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటించిన 'కిసికా భాయ్ కిసిక జాన్' సినిమాలో కీలక పాత్ర పోషించిన భూమిక.. ప్రస్తుతం పలు తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: