'ఆదిపురుష్' లో సీతగా ముందు ఆ స్టార్ హీరోయిన్ ని అనుకున్నారా..?

Anilkumar
యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సినీ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'ఆదిపురుష్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రామాయణం ఇతిహాసం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందుతున్న ఈ మూవీని టి సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో ట్రోలింగ్స్, విమర్శలను ఎదుర్కొన్న ఈ చిత్రం ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ మే 9న విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ మూవీ మేకర్స్ ఫ్యాన్స్ ని గుడ్ న్యూస్ చెప్పారు.

దీంతో ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా కనిపించబోతుండగా.. సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. అలాగే రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నాడు. ఇటీవల సీత నవమి సందర్భంగా ఈ మూవీ నుంచి కృతి సనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. జానకి దేవిగా కృతి సనన్ నార చీరలతో ఉన్న పోస్టర్ అందర్నీ ఎంతో ఆకట్టుకుంది. అయితే నిజానికి ఈ సినిమాలో సీత పాత్ర కోసం ముందుగా అనుకున్న హీరోయిన్ కృతి సనం కాదట.

మూవీ మేకర్స్ సీత పాత్ర కోసం మొదటగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనేను అనుకున్నారట. ఇదే విషయాన్ని దీపిక పదుకొనేతో చర్చించగా.. అప్పటికే ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో ఆది పురుష కోసం డేట్స్ అడ్జస్ట్ కాలేదట. దీంతో దీపిక పదుకొనే ఈ మూవీని వదులుకోవాల్సి వచ్చిందట. ఆ తర్వాత అనుష్క శర్మ, కియారా అద్వానీ, కీర్తి సురేష్ పేర్లను కూడా పరిశీలించారట. కానీ చివరకు కృతి సనన్ ని ఓకే చేశారట. మొత్తానికి ప్రభాస్ సినిమాలో హీరోయిన్ ఆఫర్ ముందు చాలామంది స్టార్ హీరోయిన్లను వరించినా.. చివరికి కృతి సనన్ మాత్రం ఆ ఛాన్స్ ని కొట్టేసింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: