గబ్బర్ సింగ్ కంటే ఉస్తాద్ భగత్ సింగ్ మించి ఉండబోతుందా..?

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే పవన్ కెరియర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న సినిమాలలో గబ్బర్ సింగ్ మూవీ ఒకటి. ఈ మూవీ లో శృతి హాసన్ , పవన్ సరసన హీరోయిన్ గా నటించగా , హరీష్ శంకర్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందించగా ... బండ్ల గణేష్ ఈ మూవీ ని నిర్మించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం గబ్బర్ సింగ్ కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో పవన్ హీరో గా నటిస్తూ ఉండగా హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ.నెల 11 వ తేదీన ఈ సినిమా నుండి గ్లిమ్స్ వీడియోను ఈ చిత్ర బృందం విడుదల చేయనుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం గబ్బర్ సింగ్ సినిమా కంటే ఈ సినిమాను అన్ని విషయాలను మెరుగ్గా ఈ మూవీ బృందం తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో పవన్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ లో పవన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: