ఓటీటీ లోకి వచ్చేస్తున్న 'విరుపాక్ష'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Anilkumar
ఈ ఏడాది ఆరంభం తర్వాత ఓ మంచి హిట్ కోసం ఎదురుచూసిన టాలీవుడ్ ఇండస్ట్రీకి సరికొత్త ఊపిరి పోసిన చిత్రం 'విరూపాక్ష'. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటించగా.. కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బాపినీడు సమర్పణలో ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ని అందుకుంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని పూర్తి చేసుకుంది. 

అంతేకాదు సాయి ధరంతేజ్ కెరియర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకున్న సినిమా కూడా ఇదే కావడం విశేషం. అప్పటి వరకు వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న సాయి ధరం తేజ్ కి 'విరూపాక్ష' భారీ కం బ్యాక్ ఇచ్చింది. ఇప్పటికే 80 కోట్లకు పైగా కలెక్షన్స్ను అందుకున్న ఈ మూవీ ఇప్పుడు 100 కోట్ల దిశగా ప్రయాణిస్తుంది. సినిమాలో సుకుమార్ స్క్రీన్ ప్లే, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలాగే ట్విస్ట్స్ ఆడియన్స్ ని కట్టిపడేసాయి. ఇప్పటికే థియేటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఈ సినిమా ఓటిటి రిలీజ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే విరూపాక్ష ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త చెక్కర్లు కొడుతోంది.

తాజా సమాచారం ప్రకారం విరూపాక్ష స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం భారీగానే చెల్లించినట్లు తెలుస్తోంది. ఈనెల 20వ తేదీ నుంచి విరూపాక్ష నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్మెంట్ రావాల్సి ఉంది.ఇప్పటికే తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమాని ఇప్పుడు ఇతర భాషల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోని ఈరోజు హిందీ తమిళ్ మలయాళ భాషల్లో ఈ చిత్రం చిత్రం విడుదల కానుండగా.. మే 12 నుంచి కన్నడలో రిలీజ్ కాబోతోంది. అన్నట్టు విరూపాక్ష మూవీకి సీక్వల్ కూడా ఉంటుందని ఇటీవల డైరెక్టర్ క్లారిటీ ఇచ్చాడు ఆడియన్స్ కూడా సీక్వెల్ కోసం ఆసక్తి ఎదురు చూస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: