చిరంజీవి నటించిన సినిమాల్లో రామ్ చరణ్ కి అస్సలు నచ్చని సినిమా ఏంటో తెలుసా..?

Anilkumar
టాలీవుడ్ సి ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. చిరంజీవి వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చరణ్ ఆ తర్వాత తన టాలెంట్ తో అంచలంచలుగా ఎదిగి ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా భారీ పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఇటీవల ట్రిపుల్ ఆర్ తో గ్లోబల్ స్టార్ గా మారిన చరణ్ ప్రస్తుతం వరుస ఇండియా  సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం దక్షిణాది సంచలన దర్శకుడు శంకర దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో, ఆ తర్వాత సుకుమార్ తో సినిమాలు చేస్తున్నాడు. 

ఇదిలా ఉంటే రామ్ చరణ్ కు తన తండ్రి చిరంజీవి నటించిన ఓ సినిమా అంటే అస్సలు నచ్చదట. నిజానికి మెగాస్టార్ నటించిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నవే. అభిమానులైతే మెగాస్టార్ సినిమాలను ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు. చాలావరకు చిరంజీవి నటించిన సినిమాలు అందరికి నచ్చుతూ ఉంటాయి. కానీ రామ్ చరణ్ కి మాత్రం చిరు నటించిన ఓ సినిమా ఏ మాత్రం నచ్చలేదట. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు 'బిగ్ బాస్'. ఈ విషయాన్ని రామ్ చరణ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. తన తండ్రి నటించిన సినిమాల్లో తనకు బాగా నచ్చిన సినిమా విజేత. ఈ సినిమా గురించి చరణ్ చాలాసార్లు చెప్పుకొచ్చాడు.

తన తండ్రి నటించిన చాలా సినిమాలు తనకు మంచి పాఠాలుగా ఉపయోగపడ్డాయని, కానీ బిగ్ బాస్ మూవీ మాత్రం తనకు ఏమాత్రం నచ్చలేదని చెప్పాడు. అయితే ఈ సినిమా ఎందుకు నచ్చలేదనే విషయాన్ని మాత్రం చరణ్ చెప్పలేకపోయాడు. దీంతో రామ్ చరణ్ కి తన తండ్రి నటించిన సినిమాలో బిగ్ బాస్ అనే చిత్రం అసలు నచ్చలేదనే విషయం ఇంటర్వ్యూ చూసినా ఫ్యాన్స్ కి సైతం అర్థమైంది. ఇక చరణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం చేస్తున్న గేమ్ చేంజర్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వచ్చే ఏడాది ఈ మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు సుమారు 250 కోట్ల భారీ బడ్జెట్లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ సరసన కియార అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఎస్,ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: