ఎన్టీఆర్ సినిమాలో.. జాన్వీ కపూర్ తల్లి పాత్రలో ఎవరో తెలుసా?

praveen
మొన్నటి వరకు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా కొనసాగిన అందరూ ఇప్పుడు బాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటే.. బాలీవుడ్లో స్టార్ కిడ్లుగా ఎంట్రీ ఇచ్చి ఇక ఇప్పుడు మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లు టాలీవుడ్ వైపు చూస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇక్కడి హీరోల సరసన ఛాన్స్ వచ్చిందంటే వదులు కోవడానికి అస్సలు ఇష్ట పడటం లేదు. ఈ క్రమం లోనే అతి లోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ సైతం టాలీవుడ్లో కి అడుగు పెట్టేందుకు సిద్ధమైంది.

 ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కుతుంది అన్న విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా రేంజ్ లో ఇక ఈ సినిమా చిత్రీకరణ జరుగుతూ ఉండడం గమనార్హం. ఈ సినిమా లో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా ఎంపికైంది. ఇక ఏ సినిమా తోనే మొదటి సారి టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగు పెట్ట బోతుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమా కు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అది సోషల్ మీడియా లో తెగ హాట్ టాపిక్ గా మారి పోతుంది.

 అయితే ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా లో హీరోయిన్ జాన్వి కపూర్ కి తల్లి పాత్ర లో సీనియర్ నటి మని చందన నటించ బోతున్నట్లు ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అయితే మనిచందన  ఇప్పుడు వరకు పలు సినిమాల్లో కీలక పాత్ర లో నటించింది. ఇక ఎప్పుడూ జాహ్నవి కపూర్ తల్లిగా ఇక మనిచందనకు  ఎలాంటి గుర్తింపు వస్తుందో చూడాలి. ఇకపోతే ఈ సినిమాకు అటు రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: