ఏజెంట్ ప్లాప్: డిప్రెషన్ తో ఇళ్ళు వదిలి వెళ్లిపోయిన అఖిల్..?

Anilkumar
స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని హీరో అఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ 'ఏజెంట్' ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేదనే విషయం తెలిసిందే. AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర సుమారు 80 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ డిజాస్టర్ ని మూటగట్టుకుంది. స్పై అండ్ యాక్షన్  ఎంటర్టైనర్ గా మూవీ ప్రేక్షకుల నుంచి భారీ విమర్శలను ఎదుర్కొంది. ఇక ఈ మూవీ రిజల్ట్ తో అఖిల్ హర్ట్ అయ్యాడని లేటెస్ట్ ఫిలిం సర్కిల్స్ లో న్యూస్ వైరల్ అవుతుంది. ఏజెంట్ మూవీ కోసం రెండేళ్లు కష్టపడ్డ అఖిల్ మూవీ ప్లాప్ అవడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడంట. 

అంతేకాదు సోషల్ మీడియాలో ఏజెంట్ మూవీ గురించి నెగటివ్ కామెంట్స్ విపరీతంగా వైరల్ అవుతున్న నేపథ్యంలో అఖిల్ ఇక్కడ ఉండలేక దుబాయ్ కి వెళ్ళిపోయాడని సమాచారం వినిపిస్తోంది. ఈ డిప్రెషన్ నుంచి బయటపడడానికే అఖిల్ దుబాయ్ కు సింగిల్ గా వెళ్ళాడని అంటున్నారు. ఇక తాజాగా అఖిల్ దుబాయ్ కి వెళ్ళిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే అఖిల్ కి ఫ్యాన్స్ ఎంతో సపోర్టివ్ గా ఉంటున్నారుమ్ ఇప్పటినుంచి అయినా మంచి సినిమాలు చేసి వరుస విజయాలు అందుకోవాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. అఖిల్ కి ఇప్పటివరకు తన కెరీర్ లో సరైన హిట్ దక్కలేదు.

ఏజెంట్ తో అది కచ్చితంగా దక్కుతుందని అనుకున్నాడు. కానీ ఈ మూవీ కూడా అఖిల్ ని గట్టెక్కించలేకపోయింది. ఇక అఖిల్ తర్వాత సినిమాకు డైరెక్టర్ ఎవరిని ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకాల్సి ఉంది. ఇటీవల దసరా మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ తో అఖిల్ నెక్స్ట్ మూవీ ఉండబోతుందని కొన్ని రూమర్స్ వినిపించాయి. కానీ దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఫాన్స్ మాత్రం రాజమౌళి, ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్స్ తో అఖిల్ సినిమా చేస్తే అతని కెరీర్ మరో లెవల్ లో ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏజెంట్ తో అఖిల్ కే కాదు సురేందర్ రెడ్డి కెరీర్ కూడా రిస్క్ లోనే పడింది.ఏజెంట్ లాంటి భారీ డిజాస్టర్ ని తీసిన సురేందర్ రెడ్డి కి నెక్స్ట్ ఏ హీరో ఛాన్స్ ఇస్తాడో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: