'ఆదిపురుష్' ట్రైలర్ పై ప్రశంసలు కురిపించిన మధ్య ప్రదేశ్ సీఎం..!!

Anilkumar
డార్లింగ్ ఫాన్స్ తో పాటు సినీ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'ఆది పురుష్' మైతలాజికల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ మొట్టమొదటిసారి శ్రీరాముడి పాత్రలో కనిపించబోతున్నాడని తెలియడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో నెలకొన్నాయి. తాజాగా విడుదలైన టీజర్, పోస్టర్స్ సినిమాపై అంచనాలను మరింత రెట్టింపు చేశాయి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన సీతగా కృతి సనన్ నటిస్తోంది. అయితే మొదట్లో ఈ సినిమాపై ఎంతో నెగిటివిటీ వచ్చింది. ముఖ్యంగా ఫస్ట్ విడుదల చేసిన టీజర్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. దాంతో మూవీ టీం రిలీజ్ వాయిదా వేసింది. 

ఇక జూన్ 16న ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు.ఇటీవల రిలీజ్ చేసిన అప్డేటెడ్ టీజర్, పోస్టర్స్ పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకున్నాయి. ఇలాంటి తరుణంలో తాజాగా మధ్యప్రదేశ్ సీఎం ఆదిపురుష్ ట్రైలర్ను వీక్షించి ట్రైలర్ పై ప్రశంసలు కురిపించారు. ఈమేరకు ట్విట్టర్ వేదికగా ఆయన మూవీ టీం ను అభినందిస్తూ ట్విట్ చేశారు. ఈ మేరకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ట్వీట్ చేస్తూ..' ఆదిపురుష్ ట్రైలర్ చూడడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుంది. సినిమాలో శ్రీరాముడి పాత్ర ప్రజలపై ప్రభావం చూపుతుంది. ఈ సినిమాలోని పాత్రలకు నటీనటులు ప్రాణం పోశారు' అంటూ పేర్కొన్నారు.

ఇక మూవీ టీం కూడా ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కి కృతజ్ఞతలు తెలుపుతూ  ట్విట్ చేసింది. ఇక ఆదిపురుష్ ట్రైలర్ను మే 9 సాయంత్రం 5:30 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. 2D వెర్షన్ తో 3D వెర్షన్ లోనూ ఈ ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నారట మేకర్స్. ఇక ప్రభాస్ కూడా త్వరలోనే ఆది పురుష ప్రమోషన్స్ లో బిజీ కాబోతున్నాడు. కేవలం ప్రమోషన్స్ కోసమే పది రోజులు కేటాయించబోతున్నాడట ఈ హీరో. అన్ని భాషల్లోనూ ప్రభాస్ తో నిర్మాతలు పలు ఇంటర్వ్యూస్ కూడా ప్లాన్ చేస్తున్నారట. ఇక టి సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు...!!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: