పెళ్ళైన హీరోకి ప్రపోజ్ చేసిన విష్ణు ప్రియ.. ఓకే అంటే పెళ్లి కూడా చేసుకుంటుందట..?

Anilkumar
బుల్లితెర యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బుల్లితెర హాట్ యాంకర్స్ లో ఈమె కూడా ఒకరు. మొదట షార్ట్ ఫిలిమ్స్ చేసిన విష్ణు ప్రియ ఆ తర్వాత బుల్లితెరపై పలు టీవీ షో లతో మంచి పాపులారిటీని సంపాదించుకుంది. చేసింది తక్కువ షోలే అయినా ఆ షోలతో పాటు సోషల్ మీడియాలో కూడా భారీ క్రేజ్ తెచ్చుకుంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన హాట్ హాట్ పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నిత్యం వార్తలో నిలుస్తూ ఉంటుంది విష్ణు ప్రియ. ప్రస్తుతం చిన్న చిన్న సినిమాల్లో హీరోయిన్ రోల్స్ చేస్తూ అటు ఆల్బమ్స్ సాంగ్స్ లో కూడా నటిస్తుంది. 

అయితే తాజాగా విష్ణు ప్రియ తనకు సంబంధించిన ఒక టాప్ సీక్రెట్ ని బయట పెట్టింది. తాను ఏకంగా పెళ్లయిన హీరోతో రిలేషన్ షిప్ లో ఉన్నానని చెబుతూ షాక్ ఇచ్చింది. ప్రముఖ యాంకర్ ఓంకార్ పోస్ట్ గా సిక్స్త్ సెన్స్ అనే షో స్టార్ మా లో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీజన్ 5 ఉత్కంఠ భరితంగా సాగుతూ బుల్లితెర ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ఇక తాజాగా ఈ షో కి బుల్లితెర యాంకర్స్ రవి, విష్ణుప్రియ హాజరయ్యారు. క్రమంలోనే ఓంకార్ ఈ షోలో విష్ణు ప్రియ ని తన ఎఫైర్ గురించి ప్రశ్న అడిగాడు.దీంతో విష్ణు ప్రియ తాను పెళ్లయిన హీరోని లవ్ చేసినట్లు చెప్తూ బోల్డ్ కామెంట్స్ చేసింది.

ఆ పెళ్లయిన హీరో మరెవరో కాదు జేడి చక్రవర్తి అని చెబుతూ షాక్ ఇచ్చింది విష్ణు ప్రియ. ప్రస్తుతం జేడీ చక్రవర్తి వయసు 54 అలాగే విష్ణు ప్రియ వయసు 36. వాళ్ళిద్దరి మధ్య ఏకంగా 18 సంవత్సరాలు తేడా ఉంది. అయినా కూడా జెడి చక్రవర్తిని తాను లవ్ చేసినట్లు విష్ణు ప్రియ ఈ షోలో చెప్పుకొచ్చింది.' ఓ వెబ్ సిరీస్ కోసం మంగళూరులో 40 రోజులు జేడి చక్రవర్తి గారితో జర్నీ చేశా. అలా పదో రోజే ఆయన వ్యక్తిత్వానికి ఫిదా అయిపోయా. గత సంవత్సరమే ఆయనకి ప్రపోజ్ కూడా చేశా. చాలా విషయాల్లో నాకు ఆయన బాగా నచ్చేసారు. ఇంకా పెళ్లి గురించి మాట్లాడుతూ నేనే ప్రపోజ్ చేసేసాను. అయితే ఇంకా ఆయన నుంచి రెస్పాన్స్ రావాలి. ఆంటీ ఒప్పుకుంటే వాళ్ళ ఇంటికి కోడలిగా వెళతా' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది విష్ణు ప్రియ.ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో  హాట్ టాపిక్ గా మారుతున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: