'నా మైనస్ పాయింట్స్ ఆ డైరెక్టర్ కే తెలుసు': అల్లరి నరేష్

Anilkumar
అల్లరి నరేష్ హీరోగా నటించిన తాజా చిత్రం 'ఉగ్రం'. ఈ వీకెండ్ మే 5న స్పెషల్ అట్రాక్షన్ గా థియేటర్స్ లో వస్తుంది ఈ మూవీ. అల్లరి నరేష్ నుంచి వస్తున్న మరో సీరియస్ మూవీ ఇది. ఈ సినిమాలో అల్లరి నరేష్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. నరేష్ తో 'నాంది' వంటి సక్సెస్ ఫుల్ మూవీ ని తెరకెక్కించిన విజయ్ కనకమెడల ఈ మూవీ ని డైరెక్ట్ చేస్తున్నారు. వీరి కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది. సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు తగ్గట్టే ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ ని అందుకుంది. ఇక రిలీజ్ దగ్గర పడడంతో ఈ మూవీకి సంబంధించిన వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు అల్లరి నరేష్. 

ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో అల్లరి నరేష్ మాట్లాడుతూ..' దర్శకుడు విజయ్ నాలో ఉన్న ప్లస్సుల కంటే మైనస్ లనే ముందుగా చెప్పేసాడు. ఈ మూవీలో పోలీస్ రోల్ కి నా ఎత్తు పొడుగు ఓకే. అయితే నాకంటే హైట్ తక్కువ ఉన్న వాళ్ళతో నేను వంగి మాట్లాడుతానని, వరుసగా కామెడీ మూవీస్ చేయడం వల్ల బాడీ లాంగ్వేజ్ తెలియకుండానే మళ్ళీ అటువైపు వెళ్తుందని, మళ్లీ వాళ్లకు పాత నరేష్ కనిపిస్తే ఆడియన్స్ డిస్కనెక్ట్ అవుతారని అన్ని ముందుగానే నాకు చెప్పాడు. దాంతో నేను చాలా జాగ్రత్తలు తీసుకొని ఉగ్రం సినిమా చేశాను. దర్శకుడు నమ్మితే సినిమా హిట్ అవుతుంది. క్రిష్ నమ్మకంతో గమ్యం వచ్చింది. సముద్రఖని నమ్మకంతో శంభో శివ శంభో వచ్చింది.

ఇప్పుడు విజయ్ నమ్మకంతో నాంది, ఉగ్రం సినిమాలొచ్చాయి. కాబట్టి దర్శకుడు నమ్మితే దాని రిజల్ట్ వేరేలా ఉంటుంది, అంటూ చెప్పుకొచ్చాడు అల్లరి నరేష్. అంతేకాదు కామెడీ చేసినోళ్లు ఎలాంటి పాత్ర అయినా చేయగలరని, అలా ఇటీవల రంగమార్తాండ మూవీలో బ్రహ్మానందం, విడుదల పార్ట్ వన్ లో సూరి ఎంతో అద్భుతంగా చేశారని, ఇప్పుడు ట్రెండ్ కూడా అలానే మారుతుంది అంటూ పేర్కొన్నాడు. దీంతో అల్లరి నరేష్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక సైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఉగ్రం రిలీజ్ కి ముందే మంచి పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేసుకుంది.కచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుందని మూవీ టీం కాన్ఫిడెంట్ తో ఉన్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: