"సింహాద్రి" మూవీ రీ రిలీజ్ కోసం సరికొత్త ప్రమోషన్స్..!

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో నటించిన బ్లాక్ బస్టర్ మూవీ లను సింహాద్రి మూవీ ఒకటి. ఈ మూవీ కి దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించగా భూమిక , అంకిత ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ లుగా నటించారు  ముఖేష్ ఋషి విలన్ పాత్రలో నటించిన ఈ మూవీ లో నాజర్ , బ్రహ్మానందం , కోటా శ్రీనివాసరావు ముఖ్య పాత్రలలో నటించారు. 2003 వ సంవత్సరం భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది.

 దానితో ఈ సినిమా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టి బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందించాడు. ఈ మూవీ విజయంలో కీరవాణి అందించిన సంగీతం కూడా అత్యంత కీలక పాత్రను పోషించింది. ఇది ఇలా ఉంటే అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ఈ సినిమాను ఈ సంవత్సరం మే 20 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు.

ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ రిలీజ్ కోసం కూడా ఈ చిత్ర బృందం అదిరిపోయే రేంజ్ ప్రమోషన్ లను నిర్వహించబోతుంది. అందులో భాగంగా ఈ మూవీ లో సూపర్ హిట్ సాంగ్ అయినటువంటి "నువ్వు విజిలెన్స్ ఆంధ్ర సోడా బుడ్డి" అనే లిరికల్ వీడియో సాంగ్ ను మే 7 వ తేదీన సాయంత్రం 5 గంటల 31 నిమిషాలకు సుదర్శన్ 35  ఎం ఎం థియేటర్ ... ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఈ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.
మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: