పెళ్లి తర్వాత అది కి ఊహించని కండిషన్ పెట్టిన భార్య..!?

Anilkumar
హీరో సాయికుమార్ వారసుడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు హీరో ఆది. కెరియర్ మొదటిలో పలు హిట్ సినిమాలలో నటించినప్పటికీ ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాలన్నీ కూడా ఫ్లాపులుగా నిలుస్తున్నాయి .ఇలా హిట్లు ప్లాపులతో  సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు ఆది. ఇలా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా ఈయన తాజాగా తన భార్య అరుణతో కలిసి వెన్నెల కిషోర్ యాంకర్ గా వ్యవహరిస్తున్న అలా మొదలైంది షో కి రావడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ ఎన్నో విషయాల గురించి ఆ షోలో వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆది భార్య అరుణ ఆది గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. 

ఆమె మాట్లాడుతూ.. ఆది తనని వాళ్ళ అక్క పెళ్లిలో చూశారని.. అలా తమతో సంబంధం కుదిరిందంటూ తెలియజేసింది ఆమె.. ఆదితో పెళ్లి అనగానే తను మొదట చాలా భయపడిందట.. ఆయన ఇండస్ట్రీకి సంబంధించిన వారు అని ..మొదట్లో చాలా కంగారు పడిందట అరుణ..పెళ్లయిన తర్వాత ఆదికి ఒక కండిషన్ కూడా పెట్టిందట అరుణ.. పెళ్లి అయిన తరువాత ఏ సినిమాల్లో కూడా లిప్ లాక్ సన్నివేశాల్లో అసలు నటించకూడదని ఆదికి తన భార్య అరుణ చెప్పినట్లుగా తెలియజేసింది.. అనంతరం ఆది తనకి ఎప్పుడూ కూడా సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇవ్వరని ఆమె తెలియజేసింది..

కానీ ఒకసారి మాత్రం ఒక హ్యాండ్ బ్యాగ్ పై మా ఇద్దరి నేమ్స్ ఉండేలా ఏ ఏ అనే లెటర్స్ తో బ్యాక్ డిజైన్ చేయించి తనకి సర్ప్రైజ్ గిఫ్ట్ ను ఇచ్చారు అంటూ తెలియజేసింది.. ఈ సందర్భంగా తన కోరికను కూడా బయటపెట్టింది ఆమె.. ఆది చేత్తో ఒక ఆమ్లెట్ వేసి ఇస్తే తినాలని ఉంది అంటూ తెలియజేస్తుంది. ఇప్పటివరకు తన కోరిక ఎప్పుడు తీయలేదని.. ఆదికి కాఫీ పెట్టడం తప్ప మరి ఏ పని రాదు అంటూ తెలియజేస్తుంది.. అలా తన కోరికను చెప్పడంతో వెంటనే వెన్నెల కిషోర్ తన చేత ఆమ్లెట్ వేయించి తన భార్యకు తినిపించాలని చెప్పాడు.. అలా వెన్నెల కిషోర్ ద్వారా తన కోరికను తీర్చుకుంది అరుణ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: