వెంకటేష్ గురించి సంచలన నిజాలను బయటపెట్టిన ప్రముఖ నటి..!?

Anilkumar
కుష్బూ ఇటీవల సన్నబడి సోషల్ మీడియాలో ఎంత హార్ట్ టాపిక్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన ఇప్పటికి కూడా కొన్ని కీలక పాత్రల్లో నటిస్తూ బిజీబిజీగా గడుపుతుంది. ఒకవైపు సినిమాలు మరోవైపు రాజకీయాల్లో కూడా కొనసాగుతోంది ఈమె. తెలుగుతో పాటు తమల భాషల్లో సైతం స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. అయితే ఒకానొక సమయంలో కుష్బూ కి గుడి కట్టిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే.అయితే కుష్బూకి ఏకంగా గుడి కట్టారు అంటే కుర్రకారులని ఆమె గ్లామర్ తో ఏ స్థాయిలో అలరించిందో తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా వెంకటేష్ పై కొన్ని సంచలన వ్యాఖ్యలను చేస్తుంది కుష్బూ. 

ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ.. వెంకటేష్ అంటే తనకు సెంటిమెంట్ అని నా ఫస్ట్ హీరో వెంకటేష్ అని ఫస్ట్ హీరో మాత్రమే కాదు.. వెంకటేష్ నా ఫస్ట్ ఫ్రెండ్ కూడా అంటూ సంచలన నిజాన్ని బయట పెట్టింది కుష్బూ. అంతేకాకుండా మేమిద్దరం ఎప్పుడూ మాట్లాడుకో కానీ కష్టం వస్తే వెంకటేష్ కచ్చితంగా నాకు తోడుగా నిలబడతాడు అంటూ చెప్పొచ్చింది. దాంతోపాటుగా సెంటిమెంట్ అనే పదంలో వెంకటేష్ సెంటి అయితే నేను మెంటల్ అంటూ చెప్పకు వచ్చింది కుష్బూ. అంతలా మేమిద్దరం కలిసి పోతాం..80 నాటి హీరోయిన్లు 32 మంది అప్పట్లో ఒక వాట్సాప్ గ్రూప్ ని పెట్టారు..

ఇక ఆ వాట్సాప్ గ్రూప్ లో చిరంజీవి రజినీకాంత్ స్టార్ హీరోల నుండి ఇప్పటివరకు ఉన్న చాలా మంది హీరోలు హీరోయిన్లు ఉన్నారట..ఇక పొద్దున్నే లేస్తే ఏం చేస్తాం ఏం తిన్నాం అని చిన్న చిన్న విషయాలను కూడా ఆ వాట్సాప్ గ్రూప్లో అందరూ షేర్ చేసుకునే వారట.. ఇక ఆ వాట్సాప్ గ్రూప్ లో వెంకటేష్ సైతం ఉన్నాడు.. కానీ ఎప్పుడూ కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వడట.. అంతేకాదు కనీసం రిప్లై కూడా ఇవ్వడట వెంకటేష్.. ఇలా కుష్బూ వెంకటేష్ గురించి మాట్లాడడంతో అందరూ షాక్ అవుతున్నారు.. ఇదిలా ఉంటే ఇక కుష్బూ ప్రస్తుతం రామబాణం సినిమాలో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు కూడా రానుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: