ఒకేసారి.. నాగచైతన్య, సమంతతో దర్శకుడు చర్చలు?

praveen
సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లపాటు లవ్ లో కొనసాగి ఆ తర్వాత తమ ప్రేమకు ప్రమోషన్ ఇచ్చుకున్న వారిలో అటు నాగచైతన్య సమంత జంట కూడా ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే క్యూట్ కపుల్స్ గా పేరు సంపాదించుకున్నారు ఈ జంట. ఎక్కడ కనిపించినా ఒకరిపై ఒకరు అమితమైన ప్రేమను చూపించుకునేవారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో మనస్పర్ధలతో విడాకులు తీసుకుని వేరుపడ్డారు.

 అయితే నాగచైతన్య,సమంత విడాకుల విషయం ఇప్పటికీ ఇండస్ట్రీకి తేరుకోలేని షాక్ అనడంలో అతిశయోక్తి లేదు.. ఇక వీరిద్దరూ విడాకుల తర్వాత ఎవరికి వారు కెరియర్ లో బిజీ అయిపోయారు. కానీ వీరిద్దరికి సంబంధించిన వార్తలు మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడు ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి. అయితే వీరిద్దరి కాంబినేషన్లో ఏం మాయ చేసావే సినిమా తర్వాత మనం అనే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ, మజిలీ అనే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి విజయాన్ని అందుకున్నాయ్.

 ఇక అక్కినేని ఫ్యామిలీ సినిమాగా పేరు సంపాదించుకున్న మనం సినిమా సైతం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. శివ నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన మజిలీ సినిమా ప్రేమ విలువ ఏంటో ప్రతి ఒకరికి తెలిసేలా చేసింది. ఇక తర్వాత మాత్రం వీరిద్దరూ కలిసి ఎక్కడ నటించలేదు. విడాకుల తర్వాత ఎవరి లైఫ్ వారు చూసుకుంటున్నారు.  అయితే ఇక ఇప్పుడు శివ నిర్వాణ నాగచైతన్యతో కలిసి ఒక ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారట. అయితే ఇప్పటికే శివ నిర్వణ విజయ్ దేవరకొండ సమంత కాంబినేషన్లో సినిమాకి వర్క్ చేస్తున్నాడు. మరో సినిమా కోసం సమంతతో చర్చలు జరుపుతున్నారట. ఇక అదే సమయంలో నాగచైతన్యత సినిమా చర్చలు కూడా జరుగుతున్నట్లు సమాచారం.  ఒకేసారి నాగచైతన్య,సమంతలతో దర్శకుడు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అఫీషియల్ ప్రకటన రాబోతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: